ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

Publish Date:May 15, 2025

Advertisement

ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసే   నెట్ వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో  సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. 

లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం. 

గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారని చెబుతున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నాయి. ట్రాన్సిట్‌ వారంట్‌ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. 

అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్‌ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్‌ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్‌కు వాంగ్మూలా లిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్‌ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్‌ అకౌంటెంట్‌. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి.  సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్‌కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్‌ 30 నుంచి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది.

By
en-us Political News

  
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.