చలికాలంలో వచ్చే నాలుగు ప్రమాదకర జబ్బులు ఇవే!

Publish Date:Dec 20, 2023

Advertisement

చలికాలం వాతావరంలో మార్పులతో పాటు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకువస్తుంది. ప్రతి ఏడాది ఇది  మామూలే కదా అని సులువుగా తీసుకోలేం.  ఎందుకంటే రాను రాను వేసవిలో ఎండలు, చలికాలంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. వీటిని భరించడం చాలా మంది వల్ల కావట్లేదు. వృద్దులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, చిన్న పిల్లలు చలికారణంగా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు. తగ్గిపోతాయని సాధారణ మందులు వాడేలోపే ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.  చలికాలంలో చాలా మామూలుగా వచ్చి ప్రాణాలకు ముప్పు కలిగించే నాలుగు జబ్బుల గురించి తెలుసుకుంటే..

ఇన్ఫ్లుఎంజా..

ఇన్ఫ్లుఎంజాను ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది  వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ముక్కు  గొంతును ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఫ్లూ ప్రమాదం పెరుగుతుంది.   జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, అలసట,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి దీని లక్షణాలు. పొడి దగ్గు  కఫం కూడా ఫ్లూ లక్షణాలలో ఉంటాయి. చలికాలంలో ముక్కు కారడం, తరచుగా తుమ్ములు,  దగ్గు చాలా సాధారణం. ఇది తేలికగానూ ఉండవచ్చు,  తీవ్రమైన సమస్యగానూ ఉండచ్చు. ఇది ఒకటి నుండి రెండు వారాల్లో నయమవుతుంది. అయితే  చాలా కాలం పాటు కొనసాగితే అది న్యుమోనియాకు దారితీస్తుంది.

శ్వాసకోశ సమస్యలు..

జలుబు చలికాలంలో వచ్చే సాధారణ సమస్య.  ఇది శ్వాసకోశ సమస్యలకు మూలం. ముక్కు కారడం, తరచుగా తుమ్ములు, దగ్గు,  కఫం వంటి సాధారణ లక్షణాలన్నీ శ్వాసకోశ సమస్యలలో ఉంటాయి.  ఇవి మూడు నుండి నాలుగు రోజుల్లో నయమవుతాయి. కొందరిలో ఇది వచ్చినప్పుడు అన్ని లక్షణాలతోపాటు గొంతునొప్పి, తలనొప్పి కూడా కనిపిస్తాయి. కొందరికి జ్వరం కూడా రావచ్చు.

బ్రోన్కైటిస్..

చలికాలంలో చల్లని  వాతావరణం బ్రోన్కైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇది సాధారణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు ఏర్పడుతుంది. బ్రోన్కైటిస్ కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  ఛాతీ నొప్పి వంటి లక్షణాలు  కనిపిస్తాయి. ఈ లక్షణాలే కాకుండా, కొంతమందికి ముక్కు దిబ్బడ,  జ్వరం మొదలైనవి కూడా ఉండవచ్చు.

గొంతునొప్పి.. స్ట్రెప్ థ్రోట్..

స్ట్రెప్ థ్రోట్ అనేది పిల్లలలో సర్వసాధారణంగా కనిపించే ఒక రకమైన గొంతు సమస్య. ఇది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో మంట,  వాపు వస్తుంది. కొంతమందికి జ్వరంతో పాటు గొంతులో నొప్పి కూడా ఉండవచ్చు. కానీ కొందరు  స్ట్రెప్ థ్రోట్,  గొంతు నొప్పి మధ్య గందరగోళానికి గురవుతారు. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.  దానిని సరిగ్గా గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. స్ట్రెప్ థ్రోట్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  గొంతు నొప్పి సాధారణం సంక్రమణ. స్ట్రెప్ థ్రోట్  యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు.  అయితే గొంతు నొప్పి కాలక్రమేణా నయమవుతుంది.

                                              *నిశ్శబ్ద.

 

By
en-us Political News

  
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.