చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Publish Date:Jun 27, 2019
Advertisement
గెలిచిన నాటి నుండి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బద్రత విషయంలో కోత విదిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది. గెలిచిన కొద్ది రోజులకి చంద్రబాబు, నారా లోకేష్‌ల భద్రతను తగ్గించిన ప్రభుత్వం తాజాగా కుటుంబ సభ్యులకు పూర్తిగా సెక్యూరిటీని తొలగించింది. తాజాగా బాబు భద్రతకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో చంద్రబాబు స్వగృహం వద్ద పోలీసు సెక్యూరిటీని పూర్తిగా తగ్గించింది. ఇప్పటి వరకూ ఆయన ఇంటికి కాపలాగా ఉన్న ఏపీఎస్పీ భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించి వేసింది. ఆయన ఇంటి దగ్గర కేవలం ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో మాత్రమే భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోకేష్, కుటుంబ సభ్యుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపధ్యంలో అగ్గికి ఆజ్యం పోసినట్టు వ్యవహరిస్తోంది ప్రభుత్వం. చంద్రబాబుకి భద్రతను తగ్గించడం కక్షసాధింపు చర్యల్లో భాగమని టీడీపీ ఆరోపిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల్ని అనుసరించే ప్రతిపక్ష నేతకు భద్రతను కల్పిస్తున్నామని టీడీపీ నేతల ఆరోపణలు సరికాదని అంటున్న్నారు. ఇన్నాళ్లు ఏపీఎస్పీ బెటాలియన్ ఆర్‌ఎస్సై, ఏఎస్సై, అయిదుగురు కానిస్టేబుళ్లు, చంద్రగిరి స్టేషన్ ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఏపీఎస్పీ పోలీసు భద్రతను తొలగించారు. చంద్రగిరి పోలీసుస్టేషన్ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రతా చర్యలు చేపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/security-reduced-for-chandrababu-naidu-residence-at-naravaripally-39-87634.html





