Publish Date:Jul 26, 2025
సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది.
ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/secunderabad-25-202831.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు