వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
Publish Date:Dec 13, 2025
Advertisement
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది. ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు. ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని, ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా చరక మహర్షి శిష్యుడైన వాగ్భటాచార్యుడు చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట. ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు, వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే 85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం 15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు. మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి 9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది, పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది. బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్, అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ, మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది. శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది. *రూపశ్రీ.
తాగునీరు.. 3 నియమాలు..
నిద్ర లేచిన వెంటనే నీరు..
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/secrets-of-ayurveda-for-a-long-and-happy-life-34-210940.html




