జగన్ ఢిల్లీ టూర్.. గుట్టురట్టు!

Publish Date:Jun 4, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల తాజా ఢిల్లీ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలదే అత్యంత కీలక పాత్ర.. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ జరిగిందంటూ మీడియాలో ఓ ప్రచారం   హోరెత్తింది. మరోవైపు ప్రధానితో సీఎం జగన్ భేటీకీ సరిగ్గా రెండు రోజుల క్రితమే.. ఒడిశా సీఎంతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారని.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలతో మోదీ వరుస భేటీలు జరుగుతున్నాయంటూ మీడియా పలు కథనాలను   వండి వార్చింది. 

అయితే ప్రధాని మోదీతో సీఎం జగన్ తాజా భేటీ వెనుక అర్థం, పరమార్థం, అంతర్థం వేరే ఉందనే ఓ టాక్   తాడేపల్లి ప్యాలెస్‌లో  హాట్ హాట్ గా నడుస్తోంది. పీఎం మోదీ, సీఎం జగన్ మధ్య దాదాపు 45 నిమిషాల భేటీ జరిగిందని.. ఈ భేటీలో టీటీడీ జేఈవో ఏ.వి.ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందనీ తాడేపల్లి ప్యాలెస్ చర్చల సారాంశం.  అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.   

ఏవీ ధర్మారెడ్డి కేంద్ర సర్వీస్ అధికారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే.. ఏవీ ధర్మరెడ్డిని తమ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై పంపాలంటూ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.   దాంతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏవీ ధర్మారెడ్డిని టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా   జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద నియమించింది. నాటి నుంచి ఆయన ఆ పోస్టులోనే ఉంటూ ఆ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సేవలో కొనసాగుతున్నారు.  

మరోవైపు టీటీడీ ఈవోలుగా ఎవరు వచ్చి.. వెళ్లినా.. తాను మాత్రం పక్కా లోకల్ అన్నట్లు   ధర్మారెడ్డి మాత్రం తిరుమలలోనే పాతుకుపోయారు. మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి కూడా మళ్లీ .. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో టీటీడీ ఈవోగా ఎఫ్ఏసీ హోదాలో ఏవీ ధర్మారెడ్డిని కొనసాగిస్తూ ఈ వైయస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు  జారీ చేసింది.  

అయితే 2022, మే 14తో డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చిన ఏవీ ధర్మారెడ్డి పదవి కాలం ముగిసింది. దాంతో ఆయన మళ్లీ అంటే.. 2022 మే 15వ తేదీ కేంద్ర హోం శాఖకు రిపోర్ట్ చేయాలి. కానీ ఈ ధర్మారెడ్డి మాత్రం ఆనంద నిలయాన్ని వదిలి .. హస్తినకు వెళ్లలేదు. దీంతో టీటీడీ ఉద్యోగులే కాదు.. తెలుగు ప్రజలు సైతం ధర్మారెడ్డి మళ్లీ పేరెంట్ కేడర్‌కు ఎందుకు వెళ్లలేదనే సంశయాన్ని   వ్యక్తం చేస్తున్నారు.   

మరోవైపు... ఏవీ దర్మారెడ్డిని టీటీడీలో కొనసాగించాలని   జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలుస్తోంది.   ఏవీ దర్మరెడ్డి మరో రెండేళ్లలో రిటైర్మెంట్ కానున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరో రెండేళ్ల సమయం ఉంది.    ఏవీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఏపీలోనే కొనసాగించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్జప్తి చేస్తూ.. అందుకు సంబంధించిన దస్త్రాన్ని   ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో పంపిందట.  

అయితే ఈ దస్త్రంపై ప్రధాన మంత్రి కార్యాలయం కోర్రిలు మీద కోర్రిలు వేసి..   పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో ఈ ఏవీ దర్మారెడ్డి చేత.. కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగానికి రాజీనామా చేయించి.. ఆయనను ఏపీ సివిల్ సర్వీస్‌ అధికారిగా తీసుకోవాలనే నిర్ణయానికి కూడా సీఎం జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. దీని వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కవాల్సి వస్తుందని.. సీఎం జగన్‌కు వారు సూచించినట్లు తెలుస్తోంది. 


ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయి..  ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశంపై  చర్చిస్తే.. ఫలితం ఉండే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌కు ఆయన ముఖ్య సలహాదారు సూచించారట. ఆ క్రమంలో   జగన్..  హస్తనకు పరుగు తీసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోం మంత్రి అమిత్ షాతో బేటీ అయినట్లు సమాచారం. మరి ధర్మారెడ్డి డిప్యూటేషన్ అంశంపై మోదీ, అమిత్ షా ద్వయం ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది   త్వరలో తేలనుంది. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నీకు ఇది... నాకు ఇది (క్విడ్ ప్రోకో) తరహా రాజకీయం జరిగినా   ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది.   
మరోవైపు.. పాదయాత్ర సందర్బంగా నాటి ప్రతిపక్ష నేతగా  జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అందుకోసం..ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు సైతం వంచుతామంటూ ప్రగల్భాలు పలికిన సంగతి   తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా జగన్ ఎన్నో చెప్పారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి.. వచ్చినా.. ఆయన మాత్రం ప్రధానితో జరిగిన భేటీలో ఏం జరిగిందో.. కనీసం పెదవి విప్పి కూడా చెప్పరన్న సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఏమిటనేది కూడా మూడో కంటికి సైతం తెలియదన్న సంగతి కూడా తెలిసిందే. కానీ తాజాగా  జగన్ ఢిల్లీ టూర్‌.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసమే అంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా జోరుగా చర్చ జరగడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్  అయింది... అవుతోంది.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.