అయినన్ పోవలె హస్తినకు.. ఢిల్లీకి కేసీఆర్

Publish Date:Oct 28, 2022

Advertisement

తప్పులు చేసి దొరికిపోయి హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్లాడు లెక్కల మాస్టరు, పిల్లలకు టెస్ట్ పెట్టి పరాగ్గా ఉండద్దని చెప్పి పంపారు పెద్దాయన..కొన్నాళ్లయ్యాక ఏకంగా హాఫియర్లీ పరీక్షల్లో ముగ్గురు వల్ల నలు గురు దొరికారని తెలిసింది. వాళ్లను మంచి విద్యార్థులే.. మా ఊరోళ్లే అని మార్కులేయించు కోవడానికి వెళ్లారు.. మళ్లీ హెడ్మాస్టర్ ఆగ్రహించారు. ఇది పొరపాటు కాదన్నారు. ఆ టీచర్ పెద్దాయన్ను సుముఖు నిగా చేసుకున్నారో లేదో గాని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తనవారిని కాపాడుకోవడానికి మళ్లీ ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఆమధ్యవరకూ ఢిల్లీ హైదరాబాద్ కి సమా నమా అని బహిరంగంగానే ప్రశ్నించిన తర్వాత హఠాత్పరిణామాలు ఆ ప్రశ్నకు నీవే బదులిచ్చుకో.. అంటూ పాత పాట పాడించారు కేంద్రం వారు. నిజవే.. అందుకే సొంత ఫ్లయిట్లో  మళ్లీ  ఢిల్లీ యాత్ర పయనం కావాల్సి వచ్చింది.

అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పార్టీకి, రాష్ట్రానికి పరువు అమాంతం తీసేసిన కేసీ ఆర్ కుటుంబం ఇప్పుడు మరో సారి తన ప్రాంతీయులను, తన పార్టీవారిని తన వ్యూహం నుంచీ తనే తప్పించడానికి ఢిల్లీ ప్రయాణం కావల్సివచ్చింది. ఇది విచిత్రపరిస్థితి. ప్రత్యర్దులను దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ముందంజ వేయాలి. కానీ అన్ని వ్యూహాలు బెడిసికొట్టడమే కేసీఆర్ కి మింగుడు పడటం లేదు. అన్ని ఆలోచించే రంగంలోకి దిగిన తర్వాత వ్యూహం దెబ్బతినడమేమిటని తెగ గింజుకుంటున్నా రు. లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రంలో కొత్త పథకంతో రాజ్యం చెలాయించవచ్చన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలీదుగాని కుమార్తె కవిత ఎత్తుగడ తండ్రి కేసీ ఆర్ ను దిగ్భ్రమకి గురి చేసేంతగా బూమరాంగ్ అయింది. దాన్నుంచీ బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేంద్రంలో ప్రధాని, హోం మంత్రిత్వ శాఖ వారిని బతిమిలాడి కుమార్తెను రక్షించుకునేందుకు తన విమానంలోనే ఢిల్లీకి పయనమై  అక్కడే మూడు నాలుగు రోజులు మకాం పెట్టారు. ఫలితం ఎలా ఉన్నా, ఏమి తేలనున్నా ఆ పర్యటన పార్టీని, రాష్ట్ర పరువును దెబ్బతీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి. 

మొదటిసారి వెళితే బావగారు బాగానే పలకరించారని రెండో సారి అత్యుత్సాహంగా వెళితే అరటిగెల తేలేదని సదరు బావ తిట్టాడట.  ఇప్పుడు కేసీఆర్ రెండవ ఢిల్లీ పర్యటన పరిస్థితి అదే.  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

తనకు, కుమార్తెకు జరిగిన అవమానాన్ని తిప్పి కొట్టే వ్యూహం వేయాలని రోజుల తరబడి  ఆలోచించి బీజేపీ వారిని ఇరికించాలన్న వల విసిరారు. డబ్బుకు  లొంగ కుండా బయటపడిన నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పరువు కాపాడా రని అందరూ పొగడ్గలతో ముంచెత్తారు. కానీ జరిగినదేమిటి.. ఆ నలుగురుని వల వేసి పార్టీలోకి తీసుకోవడానికి భారీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు వారికి అంత స్థాయే లేదని అన్నారు. అయితే అదంతా చాలా వ్యూహా త్మకంగా ఫామ్హౌస్లో ముందుగా కెమెరాల ఏర్పాట్లతోనే పకడ్బం దీగా చేయాలని అనుకున్నా రు. కానీ అనుకోగానే అన్నీ అయిపోవుగా. అసలు వారికి డబ్బు  ఆఫర్ చేస్తున్న దాఖలాలే లేవని తేలిం ది. అందువల్ల దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోనవసరం లేదని, అదంతా టీఆర్ ఎస్ పిచ్చి ఆలోచనే అని తేటతెల్లమయింది.  దీంతో తన రంగు బయటపడే సరికి తన కొంప పూర్తిగా మునిగే లోగానే, పరువు హుసేన్సాగర్ లో కలిసే లోగానే ఢిల్లీ పెద్దలను బతిమాలి బామాలి  ఈసారికీ కాసుకో దొరా అని అడగడా నికే కేసీఆర్ మరోసారి ఢిల్లీ ప్రయాణం కట్టారనేది విశ్లేషకుల మాట. 

ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు  రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్‌లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.