తెలంగాణలో మండుతున్న ఎండలు.. వడదెబ్బకు నలుగురు మృతి

Publish Date:Apr 28, 2026

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా వేసవి తీవ్రత పీక్స్ కు చేరుకుంది.  భానుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండతీవ్రత, వడదెబ్బ కారణంగా ఒక్క సోమవారం (ఏప్రిల్ 27) రోజే నలుగురు మరణించారు. ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిజామాబాద్ లో (సోమవారం (ఏప్రిల్ 27)   ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం గమనార్హం.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్,  పెద్దపల్లి జిల్లాల్లో  45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  ఇక  హైదరాబాద్‌లో   42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత  నమోదైంది.  ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అదలా ఉంటే.. మంచిర్యాలకు చెందిన 56 ఏళ్ల భోగారపు మారయ్య,  పెద్దపల్లి జిల్లాకు చెందిన 19 ఏళ్ల మహిళ   దశరథం సౌమ్య  వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే నారాయణపేట జిల్లాలో ఒక గుర్తు తెలియని వృద్ధుడు సైతం ఎండ వేడికి తట్టుకోలేక మరణించినట్లు సమాచారం.   సంగారెడ్డి జిల్లాలో పొలం పనుల్లో ఉన్న కుర్మరంగు జంగయ్య  అనే రైతుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

పగలంతా నిప్పుల కొలిమిలా ఉన్న హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ జల్లులు కురిశాయి. కాగా రానున్న మూడు రోజులూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.   వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.