స్టీఫెన్ హకింగ్.. ఒక్క కదలికతో విశ్వాన్ని శోధించిన వీరుడు..!

Publish Date:Jan 8, 2025

Advertisement

 

వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు.  మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు.  అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.  ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు.  జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.  కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన.  జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం.  ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది.

స్టీఫన్ విలియం హాకింగ్..  1942, జనవరి 8వ తేదీన జన్మించారు.  ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త.  ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు.

వైకల్యం..

విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది.  ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది.  స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది.  ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది.  ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది.

స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు  తిరిగింది.  భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది.  వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది.

అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి  మూలాధారం.  ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్  ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది.  ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.

 1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.  తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో  ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది.  కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది.  స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే  సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.


                                          *రూపశ్రీ. 

By
en-us Political News

  
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.