స్కూలు బస్సుకు ప్రమాదం.. 15 మందికి గాయాలు...
Publish Date:Sep 24, 2014
Advertisement
తిరుపతి సమీపంలోని తపన్పల్లి క్రాస్ దగ్గర ఒక స్కూలు బస్సును ఒక ఇసుక లారీ, తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూలు బస్సులో వున్న 20 మంది విద్యార్థులలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం కారణంగా బస్సు అద్దాలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ అద్దాలు తగలడం వల్లే విద్యార్థులు రక్తసిక్తమయ్యారు. బస్సులోని స్కూలు బ్యాగులన్నీ రక్తసిక్తమయ్యాయి. విద్యార్థులకు తగిలిన గాయాలన్నీ ప్రమాదకరమైనవి కావని, వారెవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/school-bus-accident-in-tirupati-15-students-injured-39-38659.html
http://www.teluguone.com/news/content/school-bus-accident-in-tirupati-15-students-injured-39-38659.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





