ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకు తాజా ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పెంచిన సుంకాల కారణంగా అక్వారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించారు.
వెంటనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న అక్వా రంగానికి అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి అక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీడీపీలో అక్వారంగం కీలకమనీ, అందుకే ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ కు రాసిన లేఖలో కోరారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై ట్రంప్ తాజాగా 27 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే చంద్రబాబు తన లేఖలో ప్రస్తావిస్తూ.. 2023్ర2034 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి కాగా, అందులో 92 శాతం వరకూ రొయ్యలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం కారణంగా అక్వారంగం దారుణంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత ఎగుమతిదారులు 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. ఇప్పుడు ఈ దిగుమతి సుంకం కూడా యాడ్ అవ్వడం అక్వా రైతులపై మోయలేని భారం వేయడమే అవుతుందనీ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ ను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/save-aqua-from-america-taxes-39-195734.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.