అమెరికా సుంకాల నుంచి ఆక్వారంగాన్ని రక్షించండి.. కేంద్ర మంత్రి పీయూష్ కు చంద్రబాబు లేఖ

Publish Date:Apr 7, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్  ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకు తాజా ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పెంచిన సుంకాల కారణంగా అక్వారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించారు.

వెంటనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న అక్వా రంగానికి అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి అక్వా రైతులను ఆదుకోవాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్ జీడీపీలో అక్వారంగం కీలకమనీ, అందుకే ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ కు రాసిన లేఖలో కోరారు. 

భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై ట్రంప్ తాజాగా 27 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే చంద్రబాబు తన లేఖలో ప్రస్తావిస్తూ.. 2023్ర2034 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి కాగా, అందులో 92 శాతం వరకూ రొయ్యలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం కారణంగా అక్వారంగం దారుణంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత ఎగుమతిదారులు  5.77 శాతం కౌంటర్‌ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. ఇప్పుడు ఈ దిగుమతి సుంకం కూడా యాడ్ అవ్వడం అక్వా రైతులపై మోయలేని భారం వేయడమే అవుతుందనీ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.  సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ ను కోరారు.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.