అత్యాచారం చేసిన సౌదీ దౌత్యవేత్తకి శిక్ష పడుతుందో లేదో?

Publish Date:Sep 10, 2015

Advertisement

 

నేటికీ రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియాలో చిన్నపాటి నేరాలకి కూడా కటినమయిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఇక హత్యలు, మానభంగాల కేసులలో అయితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే. ఆ శిక్షలు కూడా మామూలుగా ఉండవు. అటువంటి కేసుల్లో చాలాసార్లు శిరచ్చేదనం చేస్తారు.

 

అదే ఒక సౌదీ దౌత్యవేత్త పదేపదే ఇద్దరు మహిళలను రోజుల తరబడి మానభంగం చేస్తే? తను మానభంగం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిని మానభంగం చేయిస్తుంటే? రోజూ వారిని మానభంగం చేస్తూనే వారికి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా వారి చేత ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకొంటుంటే? ఎటువంటి శిక్షలు విధించాల్సి ఉంటుందో సౌదీ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది.

 

డిల్లీలోగల సౌదీ ఎంబసీలో పనిచేస్తున్న ఒక సౌదీ అధికారి ఇంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు పనిమనుషులుగా చేస్తున్నారు. వారిలో ఒకామె వయసు 50సం.లు మరొకరిది 30సం.లు. వారిరువురూ తమ కుటుంబాలను పోషించుకొనేందుకు సౌదీ అరేబియా వెళ్లి డబ్బు సంపాదించుకోవాలని ఆశ పడ్డారు. కానీ ఒక నేపాలీ ఏజెంట్ వారిని సదరు సౌదీ అధికారి ఇంట్లో పనికి కుదిర్చాడు. అప్పటి నుండి అతను వారిరువురికీ ఈ భూమ్మీద నరకం అంటే ఏమిటో చూపించాడు. రోజుల తరబడి ఆహారం లేకుండా ఇంటి పని చేయవలసి వచ్చేది. అంతే కాకుండా అతనికి రోజూ మసాజులు చేయడం, ఆ తరువాత అతను, అతని ఇంటికి వచ్చే స్నేహితుల చేతిలో మాన భంగానికి గురికావడం చాలా రోజులుగా సాగుతోంది. వారిద్దరినీ మెయితీ-ఇండియా అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ పాండే రక్షించకపోయుంటే వారు ఏదో ఒకరోజు శవాలయి తేలేవరేమో?

 

వారిని గుర్ గావ్ క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగించడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. వారిరువురినీ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందించి, వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకొన్నారు. సదరు అధికారి దౌత్యవేత్తగా పనిచేస్తున్నందున దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉంటాడు. కానీ ఆ సంగతి తెలియక అతనిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు పోలీసులు సౌదీ ఎంబసీలోకి సోమవారం ప్రవేశించారు. సౌదీ ఎంబసీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి తమ పరిధిని అతిక్రమించారని, అది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, కనుక వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ సౌదీ రాయబారి సౌద్ అల్ సతి, భారత విదేశాంగ శాఖలో గల్ఫ్ దేశాల జాయింట్ సెక్రటరీ తంగ్లూర దార్లంగ్ కి పిర్యాదు చేసారు.

 

ప్రస్తుతం సదరు అధికారిని అరెస్ట్ చేయడానికి వీలులేదు కనుక విదేశాంగ శాఖ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని క్రైం ఏ.సి.పి. రాజేష్ కుమార్ తెలిపారు. ఆ సౌదీ అధికారిని అరెస్ట్ చేయలేకపోయినా అతనితో కలిసి ఈ హేయమయిన నేరానికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వారికి దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉండి ఉంటే వారినీ అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్-సౌదీ విదేశాంగ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. బాధిత మహిళలు ఇద్దరూ నేపాల్ దేశానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఇది మూడు దేశాలకు సంబంధించిన సమస్యగా మారింది.

 

కానీ ఇటువంటి నేరాలకు కటినమయిన శిక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ దౌత్యవేత్తకి కూడా అదే విధంగా శిక్షిస్తుందో లేక అధికారులకొక న్యాయం సామాన్య ప్రజలకు మరొక న్యాయం అని అంటుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.