చిక్కుల్లో వల్లభనేని వంశీ.. విషయమేంటంటే?

Publish Date:Dec 2, 2025

Advertisement

వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లేనా అంటే తాజాగా జరిగిన పరిణామంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ.. అసెంబ్లీకి ఎన్నికైన రెండు సార్లూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో వల్లభనేని వంశీ అవకాశవాదిగా మారి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో పార్టీలు మారడం అసాధారణమేమీ కాదు. అయితే పార్టీ మారిన తరువాత మాత్రం ఆయన వ్యవహార శైలి అసాధారణంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 

ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వంశీ స్వయంగా గన్నవరం నుంచి ఓడిపోయారు. వైసీపీ హవా కొనసాగిన కాలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి దూరం కావడంతో పరాజయం పాలై మాజీ అయిపోయారు. అయితే గతంలో చేసిన తప్పులు వదలవుగా.. ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదుగా? అందుకే వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వంశీకి ఆ కేసులు చుట్టుముట్టాయి. దాడులు, దౌర్జన్యాలు, మోసం, కబ్జా ఇలా పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు వంశీపై ఉన్నాయి. వీటిల్లో గన్నవరం తెలుగుదేశం కార్యాలంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టై ఏకంగా 137 రోజులు రిమాండ్ ఖైదీలో కటకటాల వెనుక గడిపి బెయిలుపై బయటకు వచ్చారు. 

అయితే తాజాగా అదే కేసులో నిందితులై ఇంత కాలం పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరులలో ఇద్దరిని కోర్టు రిమాండ్ కు పంపింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్నవంశీ అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వారిరువురూ ఆ వారెంట్ వెనక్కు తీసుకోవాలని కోరుతూ  విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఇరువురూ కోర్టులో సరెండర్ అయ్యారు.

వారి అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయిన  తరువాత వారిరువురినీ ఈ నెల 15 వరకూ రిమాండ్ కు పంపిసతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిరువురినీ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా నలుగురు పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇరువురిని కోర్టు రిమాండ్ కు పంపడంతో ఈ కేసులో బెయిలుపై ఉన్న వంశీకి కూడా చిక్కులు తప్పవని అంటున్నారు.  ఈ ఇరువురి అరెస్టు ప్రభావం బెయిలుపై ఉన్న వంశీపై పడటం ఖాయమంటున్నారు. 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.