తమిళ రాజకీయాల్లో మరో సంచలనం  చిన్నమ్మవస్తున్నారు ...

Publish Date:May 31, 2021

Advertisement

శశికళ... తమిళ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. సుదీర్ఘ కాలంపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలిగా సర్వం తానైన సహచరిగా, చిన్నమ్మగా చక్రం తిప్పిన చరిత్ర అమెది. ఆమె స్కెచ్ గీస్తే, అంతే, కసక్ ‘ అంతటి ఘటనా ఘటన సమర్ధురాలు. అయినా ఆమె, కొంతకాలంగా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, జైలు నుంచి బెయిలుపై విడుదలై వచ్చినా, ఆమె కాలానికి తలొగ్గి, రాజకీయాలకు దూరంగా ఉండడమే కాదు, రాజకీయ  సన్యాసం సైతం ప్రకటించారు. 

అయితే, ఇప్పుడు కాలం కలిసొచ్చిందని కాదు కానీ, పరిస్థితులలో మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె, రీఎంట్రీ సంకేతాలు  ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్’సెల్వం వర్గాల మధ్య అతర్గత కుమ్ములాటలతో కుదిలైన ‘ఎఐఎడిఎంకే’ను  రక్షించేందుకు, తాను త్వరలో  క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాని ప్రకటించారు. అంతర్గత కుమ్ములాటలో పార్టీ ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న ‘ఎఐఎడిఎంకే’ కార్యకర్తలకు ఆమె, ‘నేను వస్తున్నా... నేను వచ్చేస్తున్నా’ అని భరోసా ఇస్తున్నారు.

గత కొద్దిరోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు టెలిఫోన్’లో అందుబాటులోకి వచ్చిన చిన్నమ్మ, కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత వచ్చి పార్టీని చక్కదిద్ది పట్టాల మీదకు తెస్తానని, ధైర్యం చెపుతున్నారు. ‘భయపడకండి.. కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత నేను వస్తాను’ పార్టీని చక్కదిద్దుతాను’  లారెన్స్ అనే పార్టీ అభిమాని ఫోన్’లో ఆందోళన వ్యక్త పరిచి నప్పుడు, ఆమె చెప్పిన మాటలు ఇవి. ఈ  వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అలాగే, తంజావూర్ నుంచి సురేష్ అనే మరో కార్యకర్తతోనూ ఫోన్’లో మాట్లాడిన ఆమె, “పార్టీ నాశనమై పోతుంటే, మౌనంగా చూస్తూ ఉండలేను” అంటూ  ఆమె పళనిస్వామి, పనీర్ సెల్వం మధ్య సాగుతున్న బహిరంగ పోరు పట్ల కూడా ఆమె విచారం వ్యక్తం చేశారు.అంతేకాదు  “ఇక ఆలస్యం చేయను కొవిడ్ ఉదృతి తగ్గగానే, శుభ వార్త తో వచ్చేస్తాను,ఇది ఖాయం” అని స్వరం పెంచి చెప్పారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. అలాగే, పార్టీని పెంచి పెద్దచేయడంలో ఎన్నో త్యాగాలు చేశామని గుర్తు చేసుకున్నారు.ఆ త్యాగాలు వృధా కానీయనని,అన్నారు. 

అదలా ఉంటే, ఈ వీడియోలు, వాటిలో వినవచ్చిన సంభాషణ అంతా నిజమే అని, శశికళ సన్నిహత వర్గాలు, ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) వర్గాలు దృవీకరిస్తున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగ గమనిస్తున్న ఆమె, మరో ఒకటి రెండు నెలల్లో క్రియాశీల  రాజకీయాల్లోకి రావడం  ఖాయమని  సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. 

నిజానికి, ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలోనే, ఆమె వ్యూహత్మకంగానే వెనకడుగు వేశారని , సన్యాసం ప్రకటించారని, ఎన్నికల అనంతరం ఆమె రీఎంట్రీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాగే, ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేయడం కూడా ఆమె  రాజకీయ ఎత్తుగడలో భాగమనే విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ, ప్రజల పల్స్ పట్టుకునేందుకు ఆమె వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేశారని, అలాగే, ఆమె రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో చర్చ కోరుకుంటున్నారని, ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆమె తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అలాగే, ఆమె త్వరలో కార్యకర్తలు, అభిమానులను నేరుగా కలుసుకోవడం, సమావేశాలు నిర్వహించడం కూడా ఉంటుందని, సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.  మొత్తానికి జయ సమాధి వద్ద, శపధం చేసి జైలుకు వెళ్ళివచ్చిన  చిన్నమ్మ ఇప్పుడు ఆ శపధం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారా... బుల్లి తెరపై త్వరలో చూద్దాం.

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.