వైయస్సార్ సోనియమ్మను మోసం చేశారా
Publish Date:Mar 30, 2013
Advertisement
కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్ములు దోచుకొన్న వైయస్.రాజశేఖర్ రెడ్డి పాపాలు పండటంతో కుక్క చావు చచ్చారంటూ నోరు జారి వైకాపా ఆగ్రహానికి గురయ్యారు. మళ్ళీ ఈ రోజు మరో సారి మీడియా ముందుకు వచ్చి వైయస్సార్ ని నమ్మి సోనియమ్మ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన లక్షల కోట్లు తన కొడుక్కి దోచిపెట్టి సోనియమ్మను మోసం చేసాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే, జగన్ మోహన్ రెడ్డి ఆ సోమ్మునంతా రాష్ట్రంలో పేదలకు పంచి ఇవ్వాలని అన్నారు. అయితే, రాజశేఖర్ రెడ్డి తనను మోసం చేస్తున్నాడని, కొడుక్కి లక్షల కోట్లు దోచిపెడుతున్నాడని సోనియమ్మకు తెలియకనే అప్పుడు ఆమె మౌనంగా చూస్తుండి పోయారా? రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసినప్పుడు రాష్ట్రంలో మంత్రులు, నేతలు అప్పుడు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఇదే మాటను సర్వే ఆనాడు ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే రాజశేఖర్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదు? అప్పుడు కనబడని అవినీతి ఇప్పుడు కనబడటానికి కారణం ఏమిటి? రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కూడా చాలా రోజుల వరకు ఆయన మీద సర్వ హక్కులు తమ పార్టీకే ఉన్నాయని, జగన్ పార్టీకి ఆయన మీద ఎటువంటి హక్కులు లేవని వాదించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే నాయకుడు కోట్లు దోచుకొన్నాడని, అవినీతిపరుడని, కుక్కచావు చచ్చాడని, ఎందుకంటోంది? అతను అవినీతిపరుడని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఉపేక్షించవలసి వచ్చింది? ప్రజలడిగే ఇటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ జవాబు చెపితే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/sarve-satyanarayana-39-22067.html





