జగన్ కు కడప సర్పంచ్ ల షాక్

Publish Date:Nov 7, 2022

Advertisement

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కడప జిల్లా  సర్పంచ్ లు ధర్నాలు, ర్యాలీకి దిగారు. సర్పంచ్ల ఖాతాలోకే నిధులు పడతాయి, పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్న ప్పటికీ ఇంతవరకూ తమ ఖాతాలో నిధులు వేయలేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయకుంటే తాము నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ల నిరసనలు చేపట్టా రు.అర్ధవీడు మండల సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. కంభంమండలం సర్పంచులు కూడా అదే బాట పట్టారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్క రించి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.  సర్పంచులుగా గెలిచి ఏడాదిన్నర అయినా ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పంచా యతీ అకౌంట్లను జీరో చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని వారు  అప్పట్లో డిమాండ్‌ చేశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా  ఏజెన్సీలోని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిధుల కోసం సర్పంచ్‌లు మూకుమ్మడిగా వారపు సంతలో బిక్షాటన చేపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ ఖాతాలలో జమ చేయాలంటూ మండలంలోని సర్పంచ్‌లు నిరసనగళం విప్పారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంతలో మండలంలోని సర్పంచ్‌లందరూ బిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  పంచాయతీలకు కేటా యించవలసిన నిధులను పక్కదారి పట్టించ వద్దంటూ సర్పంచ్‌లు  ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ.. భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.