నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే స్వయంగా ప్రకటించారు.
శరద్ పవార్ అభ్యర్థిత్వానికి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొన్నారు. శరద్ పవార్ ను బరిలో నింపడంపై తాను, జయంత్ పాటిల్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరేతో చర్చించినట్లు తెలిపిన సుప్రియాసూలే.. అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించామని చెప్పారు. శరద్ పవార్‌కు మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లకు కృతజ్ఞతలు చెప్పారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రతిపక్ష కూటమిలోని శివసేన (యూబీటీ)కి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీ (శరద్ పవార్) వర్గానికి 10 సీట్లు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే రాజ్యసభ స్థానంలో గెలుపు లాంఛనమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sarad-pawar-in-rajya-sabha-fray-39-215026.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.