రాజ్యసభ బరిలో శరద్ పవార్

Publish Date:Mar 4, 2026

Advertisement

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్  రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్  అఘాడీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కుమార్తె,   ఎంపీ సుప్రియా సూలే స్వయంగా ప్రకటించారు.

శరద్ పవార్ అభ్యర్థిత్వానికి   కూటమి  భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొన్నారు. శరద్ పవార్ ను బరిలో నింపడంపై తాను, జయంత్ పాటిల్  శివసేన (యూబీటీ) అధినేత  ఉద్ధవ్ థాకరేతో చర్చించినట్లు తెలిపిన సుప్రియాసూలే.. అలాగే  రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించామని చెప్పారు. శరద్ పవార్‌కు మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లకు  కృతజ్ఞతలు చెప్పారు. 

  కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు.   అయితే  ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.  మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రతిపక్ష కూటమిలోని శివసేన (యూబీటీ)కి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్‌సీపీ (శరద్ పవార్) వర్గానికి 10 సీట్లు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే   రాజ్యసభ స్థానంలో గెలుపు లాంఛనమే.   

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.