శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!

Publish Date:Feb 25, 2023

Advertisement

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ మాట కొస్తే, దేశ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కున్న స్థానం ప్రత్యేకం. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో ప్రస్తుతానికి మోదీ, షా జోడీది పై చేయి అయితే కావచ్చు కానీ, అ విషయంలో శరద్ పవార్  ఆ ఇద్దిరికీ ఏ మాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే వారికంటే పవార్ రెండాకులు ఎక్కువే చదివారు.   2019లో మహారాష్ట్ర బీజేపీ, శివసేన కూటమిలో తలెత్తిన సంక్షోభం  ప్రభుత్వం ఏర్పాటుకు అవరోధంగా మారిన సమయంలో,  ఆ ఇద్దరినీ సైతం శరద్ పవార్ బురిడీ కొట్టించారని అంటారు.

ఇక విషయంలోకి వెళితే, 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,బీజేపీ,శివసేన కూటమిని ప్రజలు గెలిపించారు. మెజారిటీ కట్ట బెట్టారు. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదు. ఈ నేపద్యంలో మరో గత్యంతరం లేకనో.  లేక రాజకీయ ఎత్తుగడలో భాగంగానో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి సిఫార్స్  మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. 

ఇంతవరకు అంతా శాస్త్రోక్తంగానే జరిగింది కానీ, ఆ తర్వాత సీన్ మారింది. శివ సేన దారికి వచ్చే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించాలన్న బీజేపీ అగ్ర నేతల ఎత్తుగడలను ముందుగానే పవార్ పసిగట్టారు. (నిజానికి రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే అయినా, కేంద్ర ప్రభుత్వం అ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం శరద్ పవార్ అంటారు)  అంతే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగామూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి పురుడు పోశారు. ఆ తర్వాత దానికి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎ) గా నామకరణం చేశారు. సరే అదంతా వేరే కథ.

ఇక శరద్ పవార్ చాణక్యం విషయానికి వద్దాం.శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అఘాడీ ప్రభుత్వం ఏర్పడాలంటే, ముందు రాష్ట్రపతి పాలన అడ్డుగా నిలిచింది. అందుకోసం పవార్, పథకం రచించారు. మాములుగా అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అంత తేలిగ్గా ఎత్తివేయదు.  ఆ విషయం పవార్ కు బాగా తెలుసు. అందుకే పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ ద్వారా బీజేపీతో రాయబేరాలు నడిపారు.  రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం తెల్లారేసరికి  బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే, దేశ రాజకీయాల్లో మహాశ్చర్యాలలో ఒకటిగా నిలిచిన  బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కేవలం మూడంటే మూడు రోజులలో   పతనమైంది. ఆ తర్వాత, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేశారు. అదంతా ఇప్పడు చరిత్ర. 

అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు  దేవేంద్ర ఫండవిస్ 2019లో అజిత్ పవర్ తో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనక  శరద్ పవార్ మద్దతు ఉందని  చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో, ‘అప్పుడేం జరిగింది?’ అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ నేపధ్యంలో శరద పవార్ అసలు గుట్టు విప్పారు. అయితే అసలు విషయం చెప్పకుండా  అప్పడు అలా రాత్రికి రాత్రి ప్రభుత్వం ఏర్పాటు జరగకపోయి ఉంటే రాష్ట్రపతి పాలన సుదీర్ఘంగా  కొనసాగేదని మాత్రమే పేర్కొన్నారు. ఆయన అంత ముక్తసరిగా చెప్పిన ఆ ఒక్క మాటే..  2019 మూడునాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఆయన ఎత్తుగడలో  భాగమేనన్న వాస్తవాన్ని బయటపెట్టేసింది. అందుకే  ఆయన పవార్  అయ్యారు. రాజకీయ ఎత్తులు , జిత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎందుకంటారో మరో సారి రుజువైంది. దటీజ్ పవార్!

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.