Publish Date:Jun 21, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు. కాగా మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యాటనలోనూ ఓ యువకుడు ఇదే డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయల్లో పుష్ప డైలాగ్ కాక రేపుతోంది.
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ! పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీలను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్ సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sangareddy-district-39-200399.html
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు.
మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు.
కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్ తెర పైకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సంధి కుదిర్చింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది.
రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ. అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది
నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం, వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది.