అదే రహస్యం.. అదే గోప్యం.. ఈ సారేం మాట్లాడారో?

Publish Date:Jun 3, 2022

Advertisement

ఏం చేస్తారో చెప్పరు.. చెప్పిందేమీ చేయరు.. అసలేం జరుగుతోందో బయటకు తెలియనీయరు. ఇదీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లుగా వ్యవహరించిన తీరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై కాడి వదిలేసిందంటూ అప్పటి అధికార పక్షంపై నిప్పులు చెరిగిన జగన్ అధికారంలోకి వచ్చాకా ఆ ఊసే మరిచారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు మోడీతో భేటీ అయినా ఆ భేటీలో చర్చించిన అంశాలేమిటి, ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్నది ఎప్పడూ వెల్లడించలేదు.   ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో దాదాపు పీఎంవోలోనే మకాం వేస్తారు. అక్కడేం చేస్తున్నారో చెప్పరు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రధానితో గురువారం దాదాపు 45 నిముషాల పాటు భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారన్నది రాజకీయ పరిశీలకుల, విలేకరుల ఇంటర్పటేషనే కానీ.. జగన్ నోటి వెంట ఏం ఒక్క మాట కూడా రాలేదు. అయితే గత భేటీలకు, తాజా భేటీకి ఒక స్పష్టమైన తేడా  మాత్రం ఉంది. గత భేటీలన్నీ జగన్ బతిమాలుకుని అప్పాయింట్ మెంటు తీసుకున్నవే.

ఆ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించి ఉంటారని భావించడం అత్యాశే అవుతుందన్నది అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలతో చెప్పేశారు. జగన్ ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. అన్నీ తీవ్రమైన కేసులే కనుక వాటి విషయంలోనే జగన్ మోడీతో భేటీలను, విజయసాయి పీఎంవో విజిట్లను వారు ఉపయోగించుకుని ఉంటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణను జాప్యం చేసేందుకు ఉన్న అవకాశాలన్నిటినీ వినియోగించుకునే వెసులు బాటు కోసమే ఆ భేటీలు, విజిట్ లు అన్నది పరిశీలకుల అభిప్రాయం.

విపక్షంలో ఉండగా ఒక్క చాన్స్ ఇస్తే తానేం చేస్తారో పదే పదే చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతగా ఏం చెప్పారో అవి మాత్రం పట్టించుకోవడం మానేశారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్.. ఇలా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ విపక్ష నేతగా తాను అధికారంలోకి వస్తే వీటన్నిటినీ చిటికెలో సాధించేస్తానని చెప్పిన జగన్ ముఖ్యమంత్రిగా వాటి గురించి ప్రస్తావించిన దాఖలాలే లేవని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరిట సొమ్ము పందేరానికే ఉన్న నిధులన్నీ వాడుస్తూ ఏరోజు కారోజు అప్పుల కోసం దేవులాడుకోవడంతోనే కాలం గడిపేశారు.  అయితే తాజా భేటీలో ఇంత కాలం తాను విస్మరించిన అంశాలపై డిమాండ్ చేసే అవకాశం ఆయనకు వచ్చింది.  

అసలు హఠాత్తుగా సీఎం జగన్ ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారన్న విషయంలోనే స్పష్టత లేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మద్దతు కోరేందుకు ప్రధానే ఆయనను పిలిపించుకున్నారా? లేక మద్దతు ఇస్తాం అంటూ స్వచ్ఛందంగా ఈయనే వెళ్లి కలిశారా అన్న విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు. భేటీ అనంతరం ప్రధానితో సమావేశం సామరస్య పూరిత వాతావరణం సజావుగా సాగిందన్న ప్రకటనతో సరిపెట్టేశారు. అనుకూల మీడియా మాత్రం యధా ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ఇలా పలు డిమాండ్లను జగన్ ప్రధాని ముందు పెట్టినట్లుగా కథనాలు ప్రచురించేసింది. అయితే వాస్తవంగా ప్రధానితో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలేమిటన్న విషయం మాత్రం బయటకు పొక్కనీయడం లేదు.

నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లన్నీ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించి ఉంటే.. ఆయన సానుకూలంగా స్పందించి ఉంటే.. ప్రధాని తరువాత నిర్మలా సీతారామన్ తో భేటీ అంత క్లుప్తంగా, అంత త్వరగా ఎందుకు పూర్తి అవుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జగన్ ప్రధానిని డిమాండ్ చేసినట్లుగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పుకుంటున్న అంశాలన్నీ ఆర్థిక పరమైనవే. అటువంటప్పుడు ప్రధాని సానుకూలంగా స్పందించి ఉంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సుదీర్ఘంగా సాగి ఉండాల్సింది. అందుకు భిన్నంగా ఏదో వెళ్లి కలిసి వచ్చేశామన్నట్లుగా నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ ఉంది.

మహా అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది కనుక మరిన్ని అప్పులకు వెసులు బాటు కల్పించాలని జగన్ కోరి ఉండొచ్చు. అంతే అంతకు మించి జగన్ కేంద్రం ఎదుట తన గళమెత్తే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు అంటున్నారు.  అందుకే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయంలో ఎప్పటి గోప్యతే కొనసాగుతోందని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాలంటే కచ్చితంగా జగన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కేంద్రానికి అవసరం. అందుకే పీఎం జగన్ ను పిలిపించుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కేంద్రం పిలుపు మేరకు వెళ్లినా జగన్ ప్రధాని వద్ద ప్రదర్శించిన హావభావాలు, వంగి వంగి మాట్లాడటం చూస్తుంటే.. ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించిన అంశాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకూ సంబంధించినవి అయి ఉండవనీ, ఔటాఫ్ ది వే.. తన వ్యక్తిగత అవసరాలకు సంబంధించి (అంటే కేసులకు సంబంధించి) అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.