పార్లమెంట్ లోపలా , బయట ఒకటే సీన్ ..

Publish Date:Jul 26, 2022

Advertisement

ఓ వంక పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణం పై చర్చకు పట్టు పడుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేస్తున్నాయి. ఉభయ సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.  సోమ వారం (జులై 25) లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ సభ్యులను ప్రస్తుత వర్షాకాలసమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.  మంగళవారం (జులై 26)  పెద్దల సభలో  ఏకంగా 19 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. డిఎంకే, టీఎంసీ, తెరాసకు  చెందిన ఈ 19 మంది సభ్యులపై ఈ వారంతం వరకు సస్పెన్షన్ వేటు వేశారు.  

నిజానికి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటిరోజు నుంచి ప్రతి రోజు కొంచెం అటు ఇటుగా ఇదే కథ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చకు పట్టుబడుతుంటే, ప్రభుత్వం చర్చకు సిద్ధమే, కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత, ధరలు, ద్రవ్యోల్బణం అంశాన్ని చర్చిద్దామని అంటోంది. అయితే, అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి. ఆర్థిక మంత్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం అత్యవసరంగా చర్చించవలసిన ధరలు, ద్రవ్యోల్బణం చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని  ఆరోపిస్తున్నాయి.

అదొక అంతులేని కథ. వరసగా ఏడవ రోజు కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. అదలా ఉంటే, పార్లమెంట్ వెలుపల కూడా రసవత్తర రాజకీయమే నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. గత వారంలో  ఫస్ట్ రౌండ్ విచారణ పూర్తి చేసిన ఈడీ ఈ రోజు సెకండ్ రౌండ్ విచారణ జరుపుతోంది. మరో వంక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధిని విచారించడం అంటే భారత మాతను బోనులో నిలబెట్టడమే అనే విధంగా ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలియచేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

అందులో భాగంగా,  ఢిల్లీ విజయ్ చౌక్‌లో, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ పార్టీ ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి తరలించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. రాహుల్ గాంధీ చాలా సీరియస్ అయ్యారు.  రాహుల్ గాంధీ పాటుగా,  లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పని చేస్తోన్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన దర్యాప్తు ఏజెన్సీలను ప్రధాని మోడీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేయడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రభుత్వానికి మేలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రజాసమస్యలు పక్కకు పోయి  రాజకీయ వివాదాలకు పార్లమెంట్ వేదిక కావడం అత్యంత దురదృష్టకరంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.