చెడుగుడు ఆడుకొంటున్న కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు

Publish Date:Mar 31, 2013

Advertisement

 

ఇటీవల యుపీయే ప్రభుత్వానికి డీయంకే పార్టీ మద్దతు ఉపసహరించుకొన్ననాటి నుండి, యుపీయేకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెడుగుడు ఆడుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఆటను కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టడం విశేషం.

 

ఆ పార్టీకి చెందిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, సమాజ్ వాది పార్టీ తమకు మద్దతు ఇస్తున్నవిషయాన్నీ కూడా పట్టించుకోకుండా సమాజ్ వాది అధినేత ములాయం సింగుకు ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయని, యుపీయేకు మద్దతు ఇచ్చేందుకు డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడంతో, బేణీ ప్రసాద్ వర్మ చేత వెంటనే క్షమాపణలు చెప్పించి ఆయనని పదవి నుండి వెంటనే తొలగించాలని లేకపోతే మద్దతు ఉపసంహరిస్తామంటూ సమాజ్ వాది పార్టీ బెదిరించేసరికి, ప్రధాని మన్మోహన్ సింగు, సోనియా గాంధీలిరువురూ కూడా ములాయం ముందు చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరక తప్పలేదు.

 

అయితే, తమను సీబీఐ చేత వేదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్న సమాజ్ వాది అధినేత ములాయం మాత్రం బెట్టు సడలించలేదు. పైగా బీజేపీ నాయకుడు అద్వానీని పొగుడుతూ మాట్లాడి యుపీయే నుండి యన్డీయే వైపు జంపు చేస్తానని సూచన ప్రాయంగా తెలియజేసారు. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయ పార్టీల కోసం వెదికినప్పుడు లలిత, మమత అనే ఇద్దరు వీరనారీ మణులు యుపీయే కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని సూచన ప్రాయంగా చెప్పడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాది పార్టీతో చెడుగుడు ఆటకు దైర్యంగా సై అంది.

 

మొట్ట మొదట ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా 2014వరకు ఎటువంటి డోకా లేదని అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషిద్ అల్వీ మాట్లాడుతూ ములాయం సింగ్ ఎన్డీయే వైపు చూడటాన్ని తప్పు పట్టారు.

 

మద్దతు ఉపసంహరిస్తామని బెదిరిస్తే బయపడుతుందనను కొన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఎదురు దాడి మొదలుపెట్టేసరికి ములాయం సింగుకు కూడా పరిస్థితులు మళ్ళీ మారాయని అర్ధం అయ్యింది. తమ మద్దతే కనుక కాంగ్రెస్ అవసరం లేకపోతే, ఇక సీబీఐతో ఏమి కొత్త తంటాలు వస్తాయోనని బయపడిన ములాయం సింగ్ “యుపీయే ప్రభుత్వం పడిపోవాలని మేము కూడా కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీతో మా సంబందాలు మరీ అంత ఘోరంగా ఏమి లేవు. ఇప్పటికీ చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని మేము నమ్ముతున్నాము,” అని ఆయన అన్నారు.

 

అయితే ఆయన ఆ మాట అన్న తరువాత కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మళ్ళీ బేణీ ప్రసాద్ వర్మ మీడియా ముందుకు వచ్చి “వచ్చే ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీకి మహా అయితే నాలుగో, ఐదో పార్లమెంటు సీట్లు రావచ్చును. ఎందుకంటే, ములాయం సింగ్ రాష్ట్ర ముస్లిం ప్రజలందరినీ మోసం చేసాడు. ఇప్పుడు ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువల్ల వచ్చే ఎన్నికల తరువాత ఆ పార్టీకి రాష్ట్రంలో అంత్యక్రియలు తప్పవు” అని అన్నారు. అందుకు ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ, ఈ సారి మాత్రం సోనియా గాంధీ కానీ, ప్రధాని గానీ మంత్రి బేణీ ప్రసాద్ మాటలకు విచారం వ్యక్తం చేయలేదు, కనీసం ఖండించ లేదు కూడా.

 

కాంగ్రెస్ పద్దతి ఎలా ఉందంటే ఏరు దాటేవరకు ఏటి మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటున్నట్లుందని ఒక పక్క విమర్శిస్తూనే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకే సమాజ్ వాది పార్టీ మళ్ళీ సిద్దపడటం చూస్తే బహుశః సీబీఐ భయం వలననే అయిఉండాలి. కానీ అదే సమయంలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ములాయం సింగ్ జోస్యం కూడా చెప్పడం మరో విశేషం.

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.