సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్
Publish Date:Jan 23, 2016
Advertisement
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను నిర్దోషి అని బొంబాయి హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారంపై సల్మాన్ కు చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్ ఆధారాలను బొంబాయి హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్‌కు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పే సరైనదని ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే అన్నారు.
కాగా 2002 వ సంవత్సరంలో సల్మాన్ వేగంగా కారు నడపడంవల్ల.. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. నలుగురికి తీవ్రంగా గాయాలైన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/salman-khan-39-54745.html
http://www.teluguone.com/news/content/salman-khan-39-54745.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





