చంద్రబాబు ‘సిద్ధం’సవాల్.. సజ్జల పసలేని కౌంటర్?

Publish Date:Sep 3, 2025

Advertisement

ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల రాజంపేట పర్యటనలో భాగంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి సిద్ధం సవాల్ విసిరారు.  ద‌మ్ముంటే అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాలనీ.. ఏ విష‌యంపైనైనా చ‌ర్చించేందుకు తాము ‘సిద్ధం’ అన్నారు. చంద్రబాబు ఈ సవాల్ ద్వారా.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  జ‌గ‌న్‌, ఆయన పార్టీ నాయకులు సిద్ధం అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పట్లో సిద్ధం అన్నారుగా,  ఇప్పుడు సిద్ధ‌మేనా? రండి అసెంబ్లీలో తేల్చుకుందామంటూ ఎద్దేవా చేశారు. కోడిక‌త్తి, గుల‌క‌రాయి డ్రామాలు,  వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య ఇలా దేనిపైనేనా చర్చకు సవాల్ అన్నారు చంద్రబాబు. 

ఈ సవాల్ కు జగన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.. కానీ ఆయన తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ సజ్జల మీడియా ముందుకు వచ్చారు. చాలా చలా విషయాలు మాట్లాడారు కానీ అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. ఆ విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారన్నారు. ఇంతోటి దానికి ఆయన మీడియా సమావేశం పెట్టడం ఎందుకన్నది ఆయనకే తెలియాలి. అయితే ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు సవాల్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. సవాళ్లు చేస్తే మేం చేయాలి.. కానీ సీఎం చేయడమేంటని ఆశ్చర్యపోయారు. ఇది సరికాదన్నారు. 

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నార‌న్న సజ్జల తల్లికి వందనం అందరికీ అందలేదని ఆరోపించారు. వర్షాలు, వరదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉంద న్నారు. ఇన్ని సమస్యలుంటే చంద్రబాబు వాటిని విస్మరించి సవాళ్లు విసరడమేంటని విమర్శించారు. ఈ అంశాలపై తాము చర్చకు సిద్ధమన్న సజ్జల.. వాటిపై చర్చించడానికైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? అంటే మాత్రం ఆ విషయం మా పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారంటూ మాట దాటేశారు. దీంతో సజ్జల మీడియా సమావేశం తరువాత విలేకరులు అసలీ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? పెట్టారు సరే ఆయన చెప్పిందేమిటి? అంటూ జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.