కర్నూలు అరాచకానికి సజ్జల సమర్ధన

Publish Date:May 24, 2023

Advertisement

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరుల అరాచకత్వాన్ని ఘనత వహించిన ప్రభుత్వ  ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు. మీడియా రాతల వల్లే వారు రెచ్చిపోయారంటూ భాష్యం చెప్పారు.

అంతే కాదు మీడియా వార్తలు ఎలా రాయాలో జ్ణాన బోధ సైతం చేశారు. రెసిడెంట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన మొత్తం ఏపీలో మీడియా వార్తలు ఏవి రాయాలి, ఎలా రాయాలి అన్న ఆదేశాలు జారీ చేశారా అని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ మీడియాలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడమే తరువాయి అంటూ రాయకపోతే.. అసలిదంతా జరిగేది కాదు కదా? అని సజ్జల వారు సెలవిచ్చారు.

సీఎం క్యాంపు కార్యాలయంవద్ద మంగళవారం ( మే 22) మీడియాతో  మాట్లాడిన ఆయన వైకాపా అంటే కార్యకర్తలు, అభిమానులు లేని పార్టీ అనుకుంటున్నారా?   మీరు రాసే వార్తల్లో కుటుంబాన్ని పలుచన చేస్తున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామా, నాట కాలంటారు.. వీటిని చూస్తే కడుపు మండకుండా ఉంటుందా?  మీ మీదా ఇలాగే రాస్తే ఊరుకుంటారా? ఇలా అభిమానులకు ఆవేశం వచ్చేలా మీడియా వ్యవహరించింది కనుకే దాడి జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు అంటూ మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని డ్రామాలాడుతూ అవి నాష్ తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తే ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో ప్రతిస్పందించి దాడికి పాల్పడి ఉంటారు. వైసీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు.  అయినా నిజంగా మీడియాలో పని చేసే వారిపై దాడి దాడి జరగలేదు అంటూ కొత్త భాష్యం చెప్పారు.  

మీడియా స్వచ్ఛను.. పరిధిని ప్రశ్నిస్తూ   సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.  దాడిని సమర్థిస్తూ సజ్జల మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడి చేసిన వారిని సమర్థిస్తూ..అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. దాడి ..వైకాపా అభిమసులు, కార్యకర్తల భావప్రకటన అని సమర్థించారు.  

డీజీపీ వ్యాఖ్యలు..తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి.  రాళ్ల దాడులను అప్పటి  డీజీపీ గౌతమ్ సావంగ్ భావప్రకటనాస్వేచ్ఛగా సమర్థిస్తే.. వ్యతిరేక వార్తులు చేస్తే దాడులు చేయరా అన్నట్లుగా ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారు.  తాము చెప్పినట్లుగా, తమకు అనుకూలంగా మాత్రమే మీడియా వార్తలు ఉండాలని, లేకపోతే దాడులు కొనసాగుతాయనీ సజ్జల  అన్యాపదేశంగా మీడియాను హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.