కర్నూలు అరాచకానికి సజ్జల సమర్ధన
Publish Date:May 24, 2023
Advertisement
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరుల అరాచకత్వాన్ని ఘనత వహించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు. మీడియా రాతల వల్లే వారు రెచ్చిపోయారంటూ భాష్యం చెప్పారు. అంతే కాదు మీడియా వార్తలు ఎలా రాయాలో జ్ణాన బోధ సైతం చేశారు. రెసిడెంట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన మొత్తం ఏపీలో మీడియా వార్తలు ఏవి రాయాలి, ఎలా రాయాలి అన్న ఆదేశాలు జారీ చేశారా అని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ మీడియాలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడమే తరువాయి అంటూ రాయకపోతే.. అసలిదంతా జరిగేది కాదు కదా? అని సజ్జల వారు సెలవిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంవద్ద మంగళవారం ( మే 22) మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా అంటే కార్యకర్తలు, అభిమానులు లేని పార్టీ అనుకుంటున్నారా? మీరు రాసే వార్తల్లో కుటుంబాన్ని పలుచన చేస్తున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామా, నాట కాలంటారు.. వీటిని చూస్తే కడుపు మండకుండా ఉంటుందా? మీ మీదా ఇలాగే రాస్తే ఊరుకుంటారా? ఇలా అభిమానులకు ఆవేశం వచ్చేలా మీడియా వ్యవహరించింది కనుకే దాడి జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు అంటూ మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని డ్రామాలాడుతూ అవి నాష్ తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తే ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో ప్రతిస్పందించి దాడికి పాల్పడి ఉంటారు. వైసీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా నిజంగా మీడియాలో పని చేసే వారిపై దాడి దాడి జరగలేదు అంటూ కొత్త భాష్యం చెప్పారు. మీడియా స్వచ్ఛను.. పరిధిని ప్రశ్నిస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాడిని సమర్థిస్తూ సజ్జల మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడి చేసిన వారిని సమర్థిస్తూ..అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. దాడి ..వైకాపా అభిమసులు, కార్యకర్తల భావప్రకటన అని సమర్థించారు. డీజీపీ వ్యాఖ్యలు..తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి. రాళ్ల దాడులను అప్పటి డీజీపీ గౌతమ్ సావంగ్ భావప్రకటనాస్వేచ్ఛగా సమర్థిస్తే.. వ్యతిరేక వార్తులు చేస్తే దాడులు చేయరా అన్నట్లుగా ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారు. తాము చెప్పినట్లుగా, తమకు అనుకూలంగా మాత్రమే మీడియా వార్తలు ఉండాలని, లేకపోతే దాడులు కొనసాగుతాయనీ సజ్జల అన్యాపదేశంగా మీడియాను హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sajjala-support-karnool-anarchy-25-155820.html





