ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం తథ్యం.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ హయాంలో ముఖ్య సలహాదారుగా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పి.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ కోటరీలో ముఖ్యభూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఔను జగన్ అరెస్టు అవుతారని సజ్జల స్వయంగా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన కేసులు పెడుతోందనీ, ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో జగన్ పై కూడా కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు.
ఒక విధంగా జగన్ అరెస్టుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పరోక్షంగా అయినా అంగీకరించేశారు. సజ్జల మాటలతో వైసీపీ నేతలు, కేడర్ కూడా జగన్ అరెస్టు అవ్వడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసి, అందుకు ప్రిపేర్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. వేరే ఎవరి దాకానో ఎందుకు స్వయంగా జగన్ కూడా అరెస్టు అనివార్యమన్న భావనకు వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అందుకే జగన్ తనను అరెస్టు చేయడానికి పోలీసులు ఎప్పుడైనా రావచ్చునని చెప్పారు. అంతే కాదు తాను తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాననీ, అరెస్టు చేసుకోవచ్చుననీ సవాల్ కూడా విసిరారు. అయితే ఆ సవాల్ విసిరిన మరుసటి రోజే ఆయన బెంగళూరు చెక్కేశారు. దీంతో జగన్ లోనూ అరెస్టు భయం మొదలైందని అంటున్నారు. అదలా ఉంచితే.. జగన్ పై కేసులు నమోదు చేస్తారని సజ్జల అనడంతో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందని సజ్జల పరోక్షంగా అంగీకరించేసినట్లేనని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సజ్జల జగన్ అరెస్టు గురించి మాట్లాడటం ద్వారా.. మద్యం కుంభకోణం కేసులో జగన్ పాత్రను ఖరారు చేసినట్లైందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-saying-about-jagan-arrest-39-199184.html
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.