Publish Date:Jun 10, 2025
అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అంతే కాకుండా ఆందోళనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
సజ్జల వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరరెడ్డి సజ్జలను రాజకీయ పిపీలకంగా అభివర్ణించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను రాష్ట్రబహిష్కరణ చేయాలని డిమాండ్ చే శారు. సజ్జల జగన్ గుమాస్తా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతు అంటూ, రాజకీయ విమర్శలు చేసే అర్హత సజ్జలకు లేదని పేర్కొన్నారు.
తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా సజ్జలపై విమర్శల వర్షం కురిపించారు. సజ్జలను ఓ మూర్ఖుడిగా అభివర్ణించిన షర్మిల ఇదే సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా అనుచిత విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. జగన్ కు సొంత చెల్లి అంటేనే మర్యాద లేదు.. ఇక రాష్ట్రంలో మహిళలపట్ల గౌరవం ఉంటుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-political-intrigue-39-199667.html
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?