ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు. పిల్ల సజ్జల నేతృత్వంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అసభ్య పోస్టులు, అశ్లీల మార్ఫింగ్ వీడియోల విషయంలో కొత్త పుంతలు తొక్కింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిందో.. అప్పటి నుంచీ పిల్ల సజ్జల కనిపించడం లేదు. వినిపించడం లేదు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా తప్పించుకున్న పిల్ల సజ్జల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారంటున్నారు. ఏకంగా మద్యం కుంభకోణం సొమ్ములను దాచడానికి, వాటిని అవసరమైన చోటికి తరలించి తిరిగి రప్పించుకోవడానికీ ఏర్పాటు చేసిన ఓ కంపెనీలో సజ్జల భార్గవ్ రెడ్డి ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం సొమ్ములను రూట్ చేయడానికి ఏర్పాటు చేసిన పలు సూట్ కేస్ కంపెనీల్లో ఒక దానిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. అది కూడా ఎలాగంటే.. మద్యం కుంభకోణం స్కాం కు సంబంధించి గత రెండు రోజులుగా సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారికి చెందిన బినామీల నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే మద్యం కుంభకోణం సొమ్మును తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఒక కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్నలు భాగస్వాములుగా ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు బయల్పడ్డాయని తెలుస్తోంది. దీంతో పిల్ల సజ్జల ఇక తప్పించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.
ఇలా ఉండగా తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజు కూడా సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 3) వారం హైదరాబాద్ లో మోహిత్ రెడ్డి ఆఫీసుతో పాటు తుమ్మగుంటలో భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలు జరిగాయి. గురువారం వారం (సెప్టెంబర్ 4) భాస్కరరెడ్డి ఇంట్లో జరుగుతున్న తనిఖీల్లో సిట్ అధికా రులతో పాటు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-involement-in-liquor-scam-39-205586.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.