సజ్జల గారూ ఇదేంటి సారూ..

Publish Date:Apr 22, 2022

Advertisement

రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే,అందులో పెద్దగా తప్పు పట్టవలసింది ఉండదు.అయితే,రాజకీయ నేతలు,ముఖ్యంగా అధికార పార్టీ నేతలు,అందునా ప్రభుత్వ ముఖ్య సలహదారు హోదాలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వం తానై చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వ్యక్తి, తమ ప్రభుత్వం వైఫల్యాలు అన్నిటికీ, ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడే బాధ్యుడు అంటే, అది చెప్పే వాళ్ళకు ఎలా ఉన్నా, వినేవాళ్ళకు, కొంచెం చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ఓ వంక స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమకు తెలిసిన ‘పవిత్ర’ భాషలో ప్రతిపక్ష పార్టీలు, తమను ఏమీ పీ...లేవని అంటుంటే, ముఖ్యసలహాదారు,అన్నీ ప్రతిపక్ష నేత పుణ్యమే అనడం ఏమిటో అన్న ప్రశ్న పబ్లిక్ నుంచి వినవస్తోంది.  
పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. నిజానికి అదేమి పెద్ద విషయం కాదు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు చుసుకుంటారు.కానీ, పోలవరం డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిన్నది, ఎందుకు మరమత్తులు చేయడం లేదు అంటే అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కారణమని, సజ్జల సమాధానం ఇవ్వడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో, చంద్రబాబు రైతులకు త్వరగా  నీళ్లివ్వడానికి వేగంగా పనులు చేయించారని, అందుకే ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని సజ్జల చెబుతున్నారు.అదే నిజమని అనుకున్నా, మూడేళ్ళుగా అధికారంలో ఉన్న శ్రీ సజ్జల వారి సర్కార్ ఏమి చేస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు డయాఫ్రం వాల్ ఎలా కట్టాలో నిపుణులకు కూడా తెలియడం లేదని ఆయన చెబుతున్నారు.అంటే మూడేళ్ళుగా పోలవరం పనులను ప్రభుత్వం పట్టించుకోనే లేదని సజ్జల చెపుతున్నారా, ఆనే ప్రశ్న కూడా వినవస్తోంది. అందుకే తమ ప్రభుత్వ వైఫల్యాలకు, చేతకాని తనానికి   చంద్రబాబు నాయుడే కారణమని చెప్పడం విడ్డూరంగానే కాదు, వినేందుకు వికారంగానూ ఉందని సామాన్యులు అంటున్నారు.  
అలాగే సజ్జల ప్రతిపక్షాల పై చేస్తున్న రాజకీయ విమర్శలు కూడా గీత దాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన విశేష రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న ప్రతిపక్షనేత  చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుని పట్టుకుని,ఆయన ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని అనడం సజ్జల స్థాయికి తగదని విమర్శకులు అంటున్నారు. నిజానికి, మీడియా స్వేచ్చను కూడా హరించి వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం విపక్షాల పై దుపు తప్పి విమర్శలు చేయడం వలన ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందని మాజీ మంత్రులు సహ వైసీపీ సీనియర్ నాయకులు కూడా, ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  
నిజానికి,సజ్జల రామకృష్ణా రెడ్డి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు, పార్టీలోనూ పదవులు ఉన్నా ఆయన ప్రధానంగా ప్రభుత్వ సలహదారు మాత్రమే.నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి సలహాదారులు చాలా మందే ఉన్నారు.అందు లో ఒకటీ అరా పేర్లు తప్పించి, మిగిలినవారు ఎవరో, ఏమి చేస్తుంటారో కూడా ఎవరికీ తెలియదు. మరో వంక సంబందిత శాఖలకు మంత్రులున్నారు. అయినా తగుదునమ్మాఅని అన్నిటికీ సజ్జల ఒక్కరే ఎందుకు సీన్’లోకి వస్తారు, అనే ప్రశ్నకూడా వినవస్తోంది. నిజానికి,సజ్జల వ్యవహర సరళి పట్ల  ఇటు మంత్రులు,అధికారులలో,అదే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రికి తమకు మధ్య అడ్డుగోడలు కడుతున్నారనే అభియోగం అన్ని విపుల నుంచి వినవస్తోంది.ఈ నేపధ్యంలోనే మీడియా వర్గాల్లో సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు,అనే చర్చ జరుగుతోంది. అంతే కాదు, సజ్జల వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముందు ముందు ముఖ్యమంత్రికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా గుసగుసలు పోతున్నట్లు తెలుస్తోంది.అయితే జగన్మోహన్ రెడ్డికి  కూడా అన్నీ తెలుసునని, అయినా ఆయన సజ్జలకు చెక్ పెట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.