నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి

Publish Date:May 29, 2025

Advertisement

అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం  . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న సామెతలా సజ్జల భార్గవ్ రెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు. 

సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయారు. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడీ కేసు నుంచి బయటపడటానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను సుద్దపూసననీ వాలంటీర్లే అసలు విలన్లను చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డిని నిన్న రెండున్నర గంటల పాటు  విచారించారు.  ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకూ తనకూ అసలు సంబంధమేలేదనీ, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేదు.  

విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఉపయోగించిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదనీ, అదంతా వాలంటీర్లు చేశారనీ పదేపదే చెప్పినట్లు తెలిసింది.  మరి వాలంటీర్లను ఎందుకు నియంత్రించలేదంటే మాత్రం సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి పన్నెండుర గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు.  

విచారణ అనంతరం విచారణాధికారి అవసరమేతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.  పర్వత  చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల తెలిపిన సీఐ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి  విచారణకు సహకరించకుంటే  అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.