23 క్రిమినల్ కేసులు.. 2017లోనే రౌడీషీట్.. సాయికృష్ణ క్రిమినల్ హిస్టరీ!

Publish Date:Jun 19, 2026

Advertisement

విజయవాడలో సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు వెనుక ఉన్న నేర చరిత్ర, దానికి అంటుకున్న రాజకీయ రంగులు చూస్తుంటే సామాన్య ప్రజలు విస్మయం చెందుతున్నారు.  ఈ కేసు  మూలాలను, ఆ రౌడీ షీటర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఏమిటని పరిశీలిస్తే..   సాయికృష్ణ  అనే ఈ వ్యక్తి కేవలం ఒక సాధారణ నేరస్థుడు కాద నీ..  వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్‌కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.  దేవినేని అవినాష్ నీడలోనే ఇతను పెరిగి పెద్దయ్యాడని, నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి. 

  సాయి కృష్ణ ట్రాక్ రికార్డ్ చూస్తే..  ఇతడిపై విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఏకంగా 23 క్రిమినల్ కేసులు  ఉన్నాయి. ఈ 23 కేసుల్లో   ఘోరమైన నేరాలు ఉన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఒక పోక్సో  కేసు, ఒక హత్య కేసు, ఒక కిడ్నాప్ కేసు ఉన్నాయి. ఇవే కాకుండా గంజాయి, డ్రగ్స్ పెడ్లింగ్‌కు సంబంధించి  మూడు కేసులు, దారిదోపిడీలకు సంబంధించి 4 కేసులు, ప్రజలపై దాడులు చేసినందుకు 5  అసాల్ట్ కేసులు ఉన్నాయి. అలాగే ఆస్తులు ధ్వంసం, చోరీలకు సంబంధించి మూడు కేసులు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఎక్స్టార్షన్ కింద ఒక కేసు, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఒక కేసుతో పాటు మూడు  సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘోరమైన నేరాల తీవ్రతను బట్టి, 2017 జనవరి 15న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు ఇతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా 20 ఏళ్ల వయసున్న యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదని పోలీసులు రౌడీ షీట్ పెట్టడానికి వెనుకాడతారు, కానీ ఇతని నేరాల తీవ్రత దృష్ట్యా చాలా చిన్న వయసులోనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 

ట్విస్ట్ ఏంటంటే, 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్ల సాయిపై ఉన్న రౌడీ షీటును   ఎత్తేయించలేదు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే..  వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. వైసీపీ హయాంలో కూడా సాయికృష్ణ పై రౌడీ షీట్ అలాగే ఉందంటేనే.. అతడు పక్కా క్రిమినల్ అని వైసిపి నేతలకు కూడా  తెలుసనే అర్ధం.  సాయికృష్ణ  ఫోన్ నుండి లభ్యమైన ఫోటోల్లో ఇతను భుజం మీద గొడ్డలి పెట్టుకుని, తుపాకీ కణతకు గురిపెట్టుకుని, మత్తు పదార్థాలు సేవిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. తానో  పెద్ద క్రిమినల్  స్వయంగా చాటుకున్నాడు.

ప్రస్తుతం ఈ కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయం   విచిత్రంగా మారింది.  సాయికృష్ణ  దేవినేని అవినాష్  అనుచరుడు కనుక.. అతడి మిస్సింగ్ పై అవినాష్  మాట్లాడాలి. కానీ వైసిపి అధినాయకత్వం  మాత్రం అవినాష్ ను మాట్లాడనీయకుండా,   మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు వంటి వారి చేత మాట్లాడిస్తూ.. ఈ కేసుకు కులం కలర్ అద్దడానికి ప్రయత్నిస్తోంది.  వాస్తవానికి వారికీ,  విజయవాడ రౌడీ షీటర్  సాయికృష్ణకి   సంబంధం ఏంటి?  ఇదే  వైసిపి కాస్ట్ పాలిటిక్స్ ను  తేటతెల్లం చేస్తున్నది.   సాయి కృష్ణ కాపు సామాజికవర్గానికి చెందినవాడు కనుక, , ఆ కులం కార్డును వాడుకుని రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ తమ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు వంటి వారిని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఈ కేసులో సస్పెండ్ అయిన   సిఐ నాగరాజు కూడా అదే కాపు స సామాజికవర్గానికి చెందిన అధికారి.  ఒక నేరస్థుడిని కాపాడటానికి, 23 ఘోరమైన కేసులు ఉన్న రౌడీ షీటర్‌ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని  వైసిపి చేస్తున్న కుల  రాజకీయాన్ని   సమాజికవర్గానికి చెందిన వారే తప్పుపడుతున్నారు. నేరస్థులకు కులం అండగా నిలవదని తేల్చి చెబుతున్నారు. 

By
en-us Political News

  
మ్యాక్ ఓఎస్‌లో కోడింగ్ మరియు డ్రాగ్ అండ్ డ్రాప్ కష్టాలు లేకుండా, కేవలం సాధారణ ఇంగ్లీష్ ప్రాంప్ట్‌తో ఆపిల్ షార్ట్‌కట్స్ క్రియేట్ చేసే సరికొత్త ఓపెన్ సోర్స్ టూల్ Shortcuts Playground పూర్తి వివరాలు మీకోసం.
దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రాబోతున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ (Jio Platforms IPO) ప్రైసింగ్ మరియు వాల్యుయేషన్ వెనుక ఉన్న అద్భుతమైన ఆర్థిక గణాంకాలు, గ్లోబల్ మార్కెట్ లెక్కలు మరియు ఎయిర్‌టెల్‌తో పోలికల పూర్తి విశ్లేషణ మీకోసం.
రిటైర్మెంట్‌కు రూ. 10 కోట్ల కార్పస్ సరిపోతుందా నిపుణులు సూచిస్తున్న సులువైన 4 స్టెప్స్ ఫార్ములాతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే మీ వ్యక్తిగత రిటైర్మెంట్ నిధిని ఇప్పుడే లెక్కించండి.
ఆన్‌లైన్ యాప్‌లు మరియు ఇ-కామర్స్ సైట్లు వాడే డార్క్ ప్యాటర్న్స్మా యాజాలం వల్ల భారతీయులు ఏటా రూ. 25,000 కోట్లకు పైగా నష్టపోతున్నారు. ఈ డిజిటల్ మోసాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో, CCPA నియమాలు ఏంటో ఇప్పుడే పూర్తిగా చదవండి.
ఇటీవల జరిగిన జీ7 సదస్సులో పీఎం జార్జియా మెలోని తనతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆరాటపడిందని, ఆమెను చూసి జాలిపడి మాత్రమే తాను ఆ సెల్ఫీకి అంగీకరించానంటూ ట్రంప్ ఒక ఇటాలియన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక దేశ మహిళా ప్రధానమంత్రిని ఉద్దేశించి, అగ్రరాజ్యాధినేత ఈ తరహాలో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది.
మీ సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులపై ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు. ఐటీ నోటీసులు రాకుండా భారీ లావాదేవీలు ఎలా చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద బంగారు సరఫరాదారుగా అవతరించబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో సుమారు 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ గుర్తించింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్న ఈ మెగా ప్రాజెక్ట్ విశేషాలు ఇవే!
హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ Strait of Hormuz వద్ద అసలు పరిస్థితి ఏంటో ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ఫిఫా ప్రపంచకప్ 2026 లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఘోరంగా విఫలమయ్యాడు. 41 ఏళ్ల రొనాల్డో ఫామ్, షాకింగ్ గణాంకాలు మరియు వయసు రీత్యా ఎదుర్కొంటున్న విమర్శల పూర్తి వివరాలు మీకోసం.
భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు చెన్నై వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్ క్లీన్ స్వీప్ కోసం చూస్తుండగా, పరువు కోసం అఫ్గాన్ పోరాడుతోంది. మ్యాచ్ వివరాలు మరియు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రెడిట్ ఇవ్వడానికి మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ నిరాకరించారు. మైదానంలో ఆటగాళ్లే గెలిపించారని, గంభీర్ హయాంలో జరిగిన టెస్ట్ పరాజయాలను గుర్తు చేస్తూ శ్రీశాంత్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇక్కడ చదవండి.
ఫిఫా ప్రపంచకప్ 2026 లో హైతీపై 3-0 తో బ్రెజిల్ ఘన విజయం సాధించింది. మాథ్యూస్ కూన్హా రెండు గోల్స్‌తో మెరవగా, వినీషియస్ జూనియర్ మరో గోల్ కొట్టి బ్రెజిల్‌ను నాకౌట్ చేర్చారు. హైతీ టోర్నీ నుండి అవుట్ అయింది.
కర్నూలులో తెలుగుదేశం కార్యకర్త తైజుం బాషాపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు తైజుం బాషా తన ఇంటి సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుండగా, పథకం ప్రకారం అతడిపై వైసీపీయులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో బాషాపై జరిగిన ఈ దాడిలో బాషా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.