సద్దుల బతుకమ్మ వేడుకలు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్‌.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు..!

Publish Date:Oct 17, 2026

Advertisement

సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. అక్టోబర్‌ 18న ఆదివారం అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్‌ (రోటరీ చిల్డ్రన్స్‌ పార్క్‌) వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా పలు జంక్షన్ల వద్ద సాధారణ వాహనాలను నిలిపివేయడం తోపాటు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

పలు జంక్షన్ల వద్ద మళ్లింపులు.!

తెలుగు తల్లి జంక్షన్‌, కర్బాలా మైదాన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ, డీబీఆర్‌ మిల్స్‌, ఇందిరా పార్క్‌, గాంధీనగర్‌, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌ మీదుగా మళ్లిస్తారు.ఖైరతాబాద్‌ వి.వి. విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్‌ రోటరీ వద్ద ప్రసాద్స్‌ ఐమాక్స్‌, మింట్‌ కాంపౌండ్‌ మార్గాల వైపు పంపిస్తారు. నల్లగుట్ట జంక్షన్‌ నుంచి బుద్ధ భవన్‌ వైపు వాహనాలను అనుమతించకుండా రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.

లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఇక్బాల్‌ మినార్‌ వైపు మళ్లించి, యూటర్న్‌ ద్వారా తెలుగు తల్లి జంక్షన్‌ మీదుగా ఫ్లైఓవర్‌పైకి పంపిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌, జబ్బార్‌ కాంప్లెక్స్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ టీ జంక్షన్‌, గోశాల, ధోబీఘాట్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బండమైసమ్మ, ఇందిరా పార్క్‌, కట్టమైసమ్మ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.ముషీరాబాద్‌, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్‌ పార్క్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌, ఎంఆర్‌వో కార్యాలయం, ధోబీఘాట్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బండమైసమ్మ, ఇందిరా పార్క్‌, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.

ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక మార్గాలు.!

ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లోనూ మార్పులు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి ఎంజీబీఎస్‌ వైపు వెళ్లే అంతర్‌జిల్లా బస్సులను స్వీకార్‌-ఉపకార్‌ జంక్షన్‌ వద్ద నుంచి వైడబ్ల్యూసీఏ, సంగీత్‌, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్‌ హాస్పిటల్‌ ఎక్స్‌ రోడ్‌, బర్కత్‌పురా, టూరిస్ట్‌ హోటల్‌, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్‌, రంగమహల్‌ మీదుగా మళ్లిస్తారు. నగర సిటీ బస్సులను కూడా కర్బాలా మైదాన్‌ నుంచి బైబిల్‌ హౌస్‌, జబ్బార్‌ కాంప్లెక్స్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ టీ జంక్షన్‌, ఇందిరా పార్క్‌, కట్టమైసమ్మ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వైపు పంపిస్తారు. ఈ మార్పులు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి.
ఈ ప్రాంతాల్లో రద్దీకి అవకాశం

వి.వి. విగ్రహం (ఖైరతాబాద్‌), పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, ఇక్బాల్‌ మినార్‌, తెలుగు తల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతి, అంబేడ్కర్‌ విగ్రహం, ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ ఎక్స్‌ రోడ్స్‌, కట్టమైసమ్మ, కర్బాలా మైదాన్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు ఈ మార్గాలకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

వేడుకలకు వచ్చే వారికి పార్కింగ్‌ ఏర్పాట్లు.!

బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే భక్తులు, ప్రజల కోసం స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, అమరవీరుల స్మారక స్థూపం, ఎన్టీఆర్‌ ఘాట్‌, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌, లుంబినీ పార్క్‌ ముందు భాగం, బీఆర్‌కే భవన్‌ రోడ్డులో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించారు. సందర్శకులు తమ వాహనాలను కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపి, ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే ట్రాఫిక్‌ ఆంక్షలను తొలగించి రహదారులపై సాధారణ రాకపోకలను పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. తాజా ట్రాఫిక్‌ సమాచారం కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఫేస్‌బుక్‌ పేజీ @HYDTP, ఎక్స్‌ ఖాతా @HYDTPను అనుసరించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ డి. జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు.

 

 

 

[ Saddula Bathukamma, Bathukamma Festival 2026, Hyderabad Traffic Restrictions, Hyderabad Traffic Diversions, Bathukamma Celebrations, Hyderabad Traffic Alert, Hyderabad Traffic Police, Traffic Advisory Hyderabad, Saddula Bathukamma Traffic Updates, Hyderabad Road Closures, Alternative Routes Hyderabad, Telangana Festivals ]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.