రాజస్థాన్ కాంగ్రెస్ లో సచిన్ vs గెహ్లాట్.. స్టోరీ కంటిన్యూస్

Publish Date:Nov 3, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ పార్టీ హై కమాండ్ కు ఇచ్చిన ఝలక్ ఇంకా ఎవరూ మరచిపోలేదు.. పార్టీ అధ్యక్షపదవికి సోనియాగాంధీ ముందుగా ఎంపిక చేసింది తనకు అత్యంత విశ్వాసపాత్రుడని భావించిన అశోక్ గెహ్లాట్ నే.. ముఖ్యమంత్రి పదవి వదులుకుని అప్పటి అధినేత్రి ఆదేశాన్ని శిరసావహించడం ఇష్టం లేక గెహ్లాట్ ఏకంగా రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు వ్యూహానికి తెరతీశారు.

తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండేందుకు తనను విశ్వసించిన అధినేత్రికా హాత్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ కోసం  నామినేషన్ వేయడానికి ముందు తదుపరి సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి తన వర్గానికి చెందిన నేతలెవరూ హాజరు కాకుండా వ్యూహం రచించారు. దీంతో సోనియా గెహ్లాట్ కు బదులుగా మల్లిఖార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ఆయన గెలిచారు. పార్టీ అధ్యక్షుడయ్యారు అది వేరే సంగతి. అయితే గెహ్లాట్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి పదిలంగా ఉండటమే కాకుండా.. ఆ పదవి కోసం పోటీలో ఉన్న సచిన్ పైలట్ కు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయిందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు.

అయితే ఆ కథ అక్కడితో ఆగిపోలేదని..ఇంకా ఉందని తాజా సంఘటనలతో రుజువైంది. గెహ్లాట్ తిరుగుబాటు వెనుక మోడీ ఉన్నారా అంటూ ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ప్రధాని మోడీ అవకాశం వచ్చినప్పుడల్లా.. అవసరం ఉన్నా లేకపోయినా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పొగడ్తల్లో ముంచెత్తే వారు. తరువాత గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా మారి చివరకు పార్టీ వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే.

అలాగే గెహ్లాట్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగుర వేయడం వెనుక కూడా మోడీ ఉన్నారా అన్న అనుమానాలు తాజాగా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలోనూ, ముఖ్యంగా సచిన్ పైలట్ లోనూ మాత్రం అవి అనుమానాలుగా కాక.. వాస్తవమేనన్న విశ్వాసంగా మారింది. అందుకు కారణమేమిటంటే.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై రాజస్థాన్  కాంగ్రెస్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సచిన్ పైలట్ వర్గీయులు గెహ్లాట్ పై విమర్శల దాడి మొదలు పెట్టారు. గెహ్లాట్ ను మోడీ ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ప్రధాని గెహ్లాన్ పై ప్రశంసల వర్షం కురిపించడంపై స్పందించిన సచిన్ పైలట్.. ఈ పొగడ్తలను గులాం నబీ ఆజాద్ తన రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడంతో పోల్చారు.

 ఆ పొగడ్తల అనంతరం గులాం నబీ ఆజాద్ వైఖరి ఎలా మారిందో గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ గెహ్లాట్ ను ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోరాదంటూ అధిష్ఠానానికి సూచన చేశారు. అంతే కాదు.. గత సెప్టెంబర్ లో రాజస్థాన్ సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి గెహ్లాట్ కు అనుకూలంగా బల నిరూపణకు సిద్ధమైన ఎమ్మెల్యేలందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై గెహ్లాట్  ఒకింత లౌక్యంగా స్పందించారు.  పైలట్ పై పరోక్షంగా చురకలు వేశారు.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.