యుద్ధానికి వందరోజులు మిగిలింది విషాదమే ...

Publish Date:Jun 3, 2022

Advertisement

ఏ రెండు దేశాల మధ్య జరిగినా యుద్ధం మిగిల్చేది విషాదం,విద్వంసమే... వందరోజులకు చేరుకున్న ‘రష్యా - ఉక్రెయిన్‌’ యుద్ధం ఇందుకు మినహాయింపు కాదు. ఈ వందరోజుల్లో ఎన్నెన్ని ప్రాణాలు గాలిలో  కలిసిపోయాయో... ఎన్నెన్ని సంసారాలు చితికిపోయాయో లెక్కలేదు. ఎంత మంది చిన్నారులు అనాధలయ్యారో, ఎందరు తల్లులు కానన్ బిడ్డలను కోల్పోయి కడుపు కోతను అనుభవిస్తున్నారో .. తెలియదు. మనిషితనం మరిచి పోయిన యుద్ద పిపాస వందల వేల మంది పాలిట మరణ శాసనమైంది. 

పొరుగు దేశం ఉక్రెయిన్‌’పై రష్యా ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తోందా, అత్మరక్షణ కోసమే రష్యా ఉక్రెయిన్‌ పై బాంబుల వాన కురిపిస్తోందా, ఉక్రెయిన్‌’ అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్నతెరచాటుయుద్ధానికి బలైపోతోందా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ దురహంకార, దుర్మార్గ దండయాత్రకు బలైపోతోంది మాత్రం, అమాయక ప్రజలు, సైనికులే .
యుద్ధం వందో రోజుకు చేరుకుంది. అయినా ఇంకా, ఉక్రెయిన్‌’ పై  బాంబుల దాడి కొనసాగుతూనే వుంది.. భవనాలు పేకమేడల్లా కూలుపోతున్నాయి. నగరాలు, పట్టణాలు ఎక్కడంటే అక్కడ వీదుల్లో శవాలే పలకరిస్తున్నాయి. బతికుంటే చాలని సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఇంత విధ్వసం జరుగుతున్నా అంతర్జాతీయ సమాజం గుడ్లప్పగించి చూడడమే కానీ, ఏమీ చేయలేక పోతోంది. రష్యా మీద ఆంక్షలు విధించినా, అవేవి పనిచేయడం లేదు. మరో వంక ‘రష్యా - ఉక్రెయిన్‌’ యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, అదే విధంగా మన దేశం సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, యుద్ధం ప్రభావం రోజురోజుకు బలపడుతోంది. 

అదలా ఉంటే యుద్ధం మిగిల్చిన విషాదం ఎంతన్న దానికి లెక్కలు లేవు.  యుద్ధంలో ఎంత మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నది ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కానీ, కనీసం 10వేల మంది తమ దేశ పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రోజుకు 60 నుంచి 100 మంది ఉక్రెయిన్‌ సైనికులు అమరులవుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఒక్క మేరియుపోల్‌లోనే 21వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం. నిజానికి, అక్కడి పరిస్థితికి సంబంధించి అందుతున్న అరకొర సమాచారం ఆధారంగా చూసినా, మృతుల సంఖ్య వేలు దాటి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యా దాడిని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్’ లోనే కాదు, తగ్గేదేలే అన్నతీరున దాడి కొనసాగిస్తున్న రష్యా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. అయితే  ఉక్రెయిన్’లోలానే రష్యాలో ఎంత ప్రాణ నష్టం జరిగిందన్నది కూడా ప్రపంచానికి తెలియరాలేదు. 30వేల మందికి పైగా క్రెమ్లిన్‌ సైనికులు మరణించి ఉంటారని జెలెన్‌స్కీ తెలిపారు.కానీ రష్యా మాత్రం ఇప్పటివరకు 1351 మంది జవాన్లు మృతిచెందారని మార్చి 25న ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఏమి జరిగింది ఎంతమంది చనిపోయారు అనేదానికి సంబంధించి అధికార, అనధికార సమాచారం  ఏదీ అందుబాటులో లేదు. 

ఇక ఉక్రెయిన్’లో జరిగిన ఆస్థి నష్టం విషయానికి వస్తే రష్యా సేనల బాంబు దాడుల కారణంగా దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్‌ పార్లమెంటరీ కమిషన్‌ వెల్లడించింది. దీంతో 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలిపింది.దాదాపు 1900 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. ఇందులో 180 నామరూపాల్లేకుండాపోయాయి. 50 రైలు వంతెనలు, 500 ఫ్యాక్టరీలు, 500 ఆసుపత్రులు నాశనమయ్యాయి.మరోవంక, ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐరాస శరణార్థలు సంస్థ అంచనా వేసింది. అయితే ఆ తర్వాత కీవ్‌ సహా కొన్ని ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు సద్దుమణగడంతో 22లక్షల మంది తిరిగి స్వదేశానికి వచ్చారని తెలుస్తోంది. ఆలాగే ఈ  వందరోజుల యుద్ధంలో 20శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆక్రమించుకుందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే  ప్రకటించారు. 

యుద్ధాన్ని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఇప్పటివరకు ఆ దేశంపై 5వేల ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంపైనా ఇన్ని ఆంక్షలు అమల్లో లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల రష్యా బంగారం, విదేశీ మారక నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. ఫలితంగా రష్యాలో 1000కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి.రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. ఇప్పటివరకు యుద్ధం కారణంగా జీడీపీలో 35శాతం కోల్పోయింది. మొత్తం నష్టం 600 బిలియన్‌ డాలర్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, యుద్ధం అనర్దాన్నే మిగిల్చింది. అయినా, ఫిబ్రవరి 24 సైనిక చర్యగా మొదలైన యుద్ధం, ముగింపు ఎప్పుడో, ఇంకెంత దూరంలో వుందో తెలియకుండా కొనసాగుతూనే వుంది.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.