Publish Date:Aug 21, 2025
అలాస్కా సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా సిటిజన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా సిటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా అతడు తన బైక్ గురించి చెప్పుకొచ్చారు. అది తనకు చాలా చాలా ఇష్టమైన బైక్ అన్నాడు. అయితే ఇప్పుడు పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడి భాగాలు అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు.
కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇది నజమేనా? నమ్మలేకపోతున్నా అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసి అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక దళంలో పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా? మన కరెన్సీలో అక్షరాలా 19 లక్షల రూపాయలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/russia-president-putin-rare-gift-to-american-citizen-39-204711.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.