Publish Date:Sep 10, 2024
మిగతా విషయాల్లో ఏమోగానీ, ఒక విషయంలో మాత్రం మన ఇండియాని తలదన్నే దేశం ప్రపంచంలోనే లేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఇండియన్స్ ఉద్ధండపిండాలే! ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటా అని ఆలోచనలో పడి, ఎక్కడకెక్కడికో వెళ్ళిపోయి, ఏదేదో ఊహించుకోకండి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా అదేంటో నేనే చెప్పేస్తా. అదేనండీ.. పిల్లల్ని కనడం. అవునండీ బాబు.. పిల్లల్ని కనే విషయంలో మన ఇండియన్ల తర్వాతే ఎవరైనా! దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టుగా... మనం మన గురజాడ గారి అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని జనాభాలో నంబర్‌వన్ దేశంగా నిలిపాం. రాబోయే రోజుల్లో ఏ దేశమూ మనకు పోటీగా నిలవకుండా వుండాలని ‘ఆ’ కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాం. మన పరిస్థితి ఇలా వుంటే ఆ రష్యా పరిస్థితి మరోలా వుంది. గత కొద్ది సంవత్సరాలుగా రష్యాలో పుట్టే పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయిందట. వయసు పైబడినవారు టపా కట్టేస్తున్న సంఖ్య మాత్రం పెరుగుతూనే వుందిగానీ, పుట్టేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా వుంది. ఇలా అయితే రష్యాలో జనాభా భారీ స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం వుందని ఆ దేశంవాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు.
ఈ ఏడాది జూన్ వరకు రష్యాలో ఐదు లక్షల 99 వేల 6 వందల మంది పిల్లలు పుట్టారు. ఇది గత ఏడాదితో పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే 16 వేలు తక్కువ. పుట్టేవాళ్ళ నంబర్ ఇలా తగ్గిపోతే, పోయేవాళ్ళ నంబర్ మాత్రం పెరిగిపోయింది. ఈ ఏడాదిలో జూన్ వరకు చూస్తే, 3 లక్షల 25 వేల వందమంది చనిపోయారు. గత ఏడాది పోయినవాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది 49 వేలు ఎక్కువ. అంటే ఏంటి? అప్‌లోడ్ ఎక్కువైపోయింది. డౌన్‌లోడ్ తక్కువైపోయింది. అంతేకాకుండా, పిల్లల్ని కనడంలో తమవంతు కృషి చేయాల్సిన రష్యన్ యూత్‌లో 15 వేలమంది ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో చనిపోయారు. రష్యాలో జనాభా సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే గుడ్డిలో మెల్లలాగా ఈ మధ్యకాలంలో రష్యాకి వలస వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దాంతో జనాభా సంఖ్య ప్రాబ్లం కొద్దిగా కవర్ అవుతోంది. అయినా సరే, జనాభాని ఇలా పెంచడం కాదు.. మనమే కష్టపడి పెంచాలని రష్యావాళ్ళు అనుకుంటున్నారు. దీనికోసం ‘ప్రత్యేక జనాభా ఆపరేషన్’ అనే కార్యక్రమాన్ని రష్యా ప్రభుత్వం చేపట్టింది. అదేంటీ... పిల్లల్ని తగ్గించడానికి ఆపరేషన్లు చేస్తారు కదా అనుకుంటున్నారు కదా? ఇది మీరు అనుకుంటున్న ఆపరేషన్ కాదు... జననాల సంఖ్య పెంచడానికి రష్యా ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం. ఈ పథకం ప్రకారం రష్యాలో ఏ మహిళ అయినా పది లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే ఆ మహిళకు మిలియన్ రూబెల్స్.. అంటే మన ఇండియా కరెన్సీలో 13 లక్షల రూపాయలు ఇస్తారట. కాకపోతే దీనికి ఒక కండీషన్ కూడా వుంది. అదేంటంటే, ఆ మహిళ మినిమమ్ పదిమంది పిల్లల్ని కనాలి. పదో బిడ్డ మొదటి పుట్టినరోజున ఈ డబ్బు రష్యా ప్రభుత్వం ఆ తల్లికి ఇస్తుంది. దీని వెనుక ఇంకో తిరకాసు కూడా వుందండోయ్... పదో బిడ్డ పుట్టినరోజు జరుపుకునే రోజు నాటికి ఆ పది పిల్లల పిల్లి.. సారీ.. పది పిల్లల తల్లి తాలూకు మిగతా తొమ్మిది మంది పిల్లలు జీవించే వుండాలి. అదీ విషయం. ఇలా వరసబెట్టి పది పిల్లల్ని కనేసి క్యాష్ ప్రైజ్ తీసుకోవాలని చాలామంది రష్యన్ లేడీస్‌కి వున్నప్పటికీ, ఈ కండీషన్ల కారణంగా కాంపిటీషన్లోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారట. మొత్తానికి రష్యాకి పెద్ద కష్టమే వచ్చి పడింది. అయినా ఇలాంటి విషయాలు మన ఇండియన్లని చూసి నేర్చుకోవచ్చు కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/russia-population-problem-39-184567.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.