జ‌గ‌న్‌లా.. ఉక్రెయిన్‌ను 3 ముక్కలు చేసిన పుతిన్‌.. ప్ర‌పంచదేశాలు ఫైర్‌

Publish Date:Feb 22, 2022

Advertisement

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేసి ఆంధ్రుల‌తో ఓ ఆట ఆడుకున్నారు జ‌గ‌న‌న్న‌. ఇక‌, ఉక్రెయిన్‌ను మూడు భాగాలుగా విభ‌జించి యుద్ధ క్రీడ ఆరంభించారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌. ఇన్నాళ్లూ తాను పెంచి పోషించిన‌.. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర్వులు జారీ చేయ‌డంతో ప్ర‌పంచ దేశాలు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాయి. పుతిన్ యుద్ధ‌నీతికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. 

ఉక్రెయిన్ దేశం.. ఉక్రెయిన్‌తో పాటు.. కొత్త‌గా దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. వీటిని ‘రిపబ్లిక్‌ పీపుల్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌’గా పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని ప్రకటించింది. ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు పుతిన్‌. ఆ మేర‌కు డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ‘‘ఉక్రెయిన్‌కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్‌ సొంతగా అణ్వాయుధాలు తయారు చేయగలదు. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు’’ అని ర‌ష్యా అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. 

శాంతిని కోరుకుంటున్నాం.. కానీ ఉక్రెయిన్‌ భూభాగాన్ని వదులుకునేది లేదంటూ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌ స్కీ తమ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ‘‘ఉక్రెయిన్‌ సౌర్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘిస్తోంది. శాంతి ఒప్పందాలను పట్టించుకోకుండా కయ్యానికి కాలుదువ్వుతోంది. కానీ ఇది మా దేశం. మేం ఎవరికీ భయపడేది లేదు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేసేది లేదు. మేం ఎవరికీ ఏమీ రుణపడి లేం. అలాంటప్పుడు ఎవరికీ ఏం ఇవ్వబోం. మా భూభాగాన్ని కోల్పోవడానికి మేం ఏ మాత్రం సిద్ధంగా లేం’’ అని జెలెన్‌ స్కీ తేల్చి చెప్పారు.   

ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ పేరిట రష్యా చేపట్టిన చర్యలు ‘అర్థం లేనివి’ అని అమెరికా మండిప‌డింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే రష్యా కొన్ని ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించిందని ఆరోపించింది. రష్యా చర్యలను బ్రిటన్‌ సహా పలు దేశాలు ఖండించాయి. జర్మనీ ఛాన్సలర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కూడా పుతిన్‌ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది.   

రష్యా - ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్రిక్తతలు తగ్గించడం తక్షణ ప్రాధాన్యత అని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత రాయబారి తిరుమూర్తి తెలిపారు. 

ఇక‌, రష్యాపై నాటో కూటమి, ఐరోపా సమాఖ్య, బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలు ప‌లు ఆంక్ష‌లు విధించాయి. ఉక్రెయిన్‌ నుంచి వేర్పడిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు అడ్డుకోనున్నాయి.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.