రుణ మాఫీ ఓ ఎన్నికల స్టంట్ 

Publish Date:Aug 4, 2023

Advertisement

వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు  రుణ మాఫీ చేయడం సహజమే.  సాధారణంగా ఎన్నికల ముందు రుణ మాఫీలు జరుగుతుంటాయి. రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులను ఆయా ప్రభుత్వాలు తీర్చడమే రుణ మాఫీ అంటారు. వారు తమ పంటలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కొన్ని సమయాల్లో వాతావరణ పరిస్థితులు మరియు వనరుల లభ్యత కారణంగా , పంటలు విఫలం కావచ్చు మరియు రైతులు తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఆదాయాన్ని పొందలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు విధిగా రుణ మాఫీ చేయాలి.  తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6385 కోట్లు ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన చేశారు.వ్యవసాయానికి జవజీవాలనందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి.. ధీరత్వం తొణికిసలాడుతోందని  అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్బావానికి ముందు పదేళ్ల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 7,994 కోట్లు ఖర్చు చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జనవరి మాసానికి  లక్షా 91వేల 612 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేసినట్టు గణాంకాలు తెలియ జేస్తున్నాయి. 
ఒక్క రైతు బంధు పథకానికే 15,075 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు బీమాకు  15 వేల 98 కోట్లు ఖర్చు బడ్జెట్ లో  కేటాయింపులు చేసినప్పటికీ రైతులకు ఎటువంటి బీమా ప్రయోజనాలు అందడం లేదని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. 90 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 6385 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రుణ మాఫీ జరగలేదు. రైతులు అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వానికి రుణ మాఫీ కోసం అర్జీపెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతు మొరను ఆలకించలేదు. అయితే ఎన్నికల స్టంట్ లో భాగంగా రైతు రుణ మాఫీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుద్దరించారు. 
రైతు బంధు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతుంది  అని అప్పట్లో వార్తలు వచ్చాయి. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రుణమాఫీని కూడా క్లియర్ చేసేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ఈ వార్తలు వెలువడ్డాయి. కొత్త సంవత్సరం వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా ముఖ్యమంత్రి నోటి నుంచి రుణ మాఫీ ప్రకటన వెలువడ లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రైతుల విషయంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్  ప్రభుత్వం.  కాబట్టే ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. 
 రైతులకు 10వ దఫా రైతు బంధును ప్రారంభించిన ప్రభుత్వం రుణమాఫీని కూడా క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని గురువారం నుంచే అమలు చేస్తున్నారు. 

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.