సెంటిమెంటే దిక్కు.. తెలుగు రాష్ట్రాల్లో రూలింగ్ పార్టీలకు అదే ఫీలింగు?

Publish Date:May 1, 2022

Advertisement

ఎన్నికల్లో ఓట్లు పడాలంటే.. సెంటిమెంట్ రాజేయాలి. అలా అయితే మళ్లీ అధికారం హస్తగతమవుతోంది. తాజాగా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోన్నాయి తెలుగు రాష్టాల్లోని రూలింగ్ పార్టీలు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు, నీటి కష్టాలు, రహదారుల పరిస్థితి పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌  ఉరుములేని పిడుగులా మాటలతో విరరుచుకుపడ్డారు.  ఆయన అలా అన్నారో లేదో.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలు తెలంగాణపై ఒంటి కాలి మీద లేస్తున్నారు.  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఒక అడుగు ముందుకు వేసి, విభజన హామీల అమలులో భాగంగా ఇంకా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయిల నగదు రూపంలో రాష్ట్ర వాటా కింద ఏపీకి రావాల్సి ఉందంటూ విభజన కారణంగా ఏపీ అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.     తెలంగాణ నుంచి ఏపీకి ఇంకా  బకాయిలు రావాలసి ఉందని, ఏపీ సొమ్ముతో తెలంగాణ సోకులు చేసుకుంటోందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు.   తెలంగాణలో నిన్న మొన్నటి వరకు విద్యుత్ కోతలు ఉన్నాయని.. రహదారులు పరిస్థితి కూడా అంతగా బాగోలేదంటూ సజ్జల మీడియావివరించారు.   తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్లు.. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ, తెలంగాణ సీఎం అద్భుతంగా పాలిస్తున్నారని కితాబులిస్తుంటే..   ఏపీ మంత్రి బొత్స.. హైదరాబాద్‌లో కూడా కరెంట్ కోతలన్నాయని.. తన ఇంట్లో విద్యుత్ కోత వల్ల జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ఇంతా వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలోనే ఏపీ మంత్రి రోజా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం.. అలాగే టీఆర్ఎస్ ప్లీనరీ జరిగిన 48 గంటల్లోనే మళ్లీ ఆంధ్రలో పరిస్థితులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే..  మళ్లీ ఆంధ్ర - తెలంగాణ సెంటిమంట్ రగిలించి.. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల నేతలు ఏదో ఓ విధంగా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇటు ఏపీ మంత్రులు కానీ.. అటు తెలంగాణ మంత్రులు కానీ వీసమెత్తు మాటలు మాట్లాడలేదని ఈ సందర్బంగా వారు గుర్తు చేస్తున్నారు. చివరికీ ఆంద్రప్రదేశ్‌కు రావలసిన హక్కులన్నీ తెలంగాణ సీఎం కెసిఆర్ కాళ్ల వద్ద సీఎం జగన్ వదిలేసి..  రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్న సంగతిని ప్రస్తావిస్తున్నారు.  జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కి  మూడేళ్లయితే.. ఇప్పటి వరకు గుర్తుకు రాని విభజన హామీలు..  ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా    పొలిటికల్ డ్రామాయేనని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.  తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టిన  టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ప్రజల్లో బాగా పడిపోయిందనీ, వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ఈ నేపథ్యంలో మరోసారి  అధికారం చేజిక్కించుకోవాలంటే ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ తప్ప వేరే గత్యంతరం లేదని..  కేసీఆర్ జగన్ లు భావించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు విభజన హామీ3ల పల్లవి అందుకున్నాయని   సోషల్ మీడియాలో అయితే తెగ ట్రోల్ అవుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఎన్నికల  తెర తీసిన ఈ కొత్త డ్రామా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలంటూ  సామాజిక మాధ్యంలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.   జగన్ ముఖ్యమంత్రి కావడానికి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సాయం అంతా ఇంతా కాదని... అలాగే కేసీఆర్ చేసిన సాయానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ చేసిన త్యాగం అంతకన్నా వంద రెట్లు అధికమని నెటిజన్లు పేర్కొంటున్నారు. 

By
en-us Political News

  
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.