కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి దోపిడీ.. కుకట్ పల్లిలో సంచలన ఘటన

Publish Date:Mar 17, 2026

Advertisement

హైదరాబాద్‌ కూకట్ పల్లిలో భారీ దోపిడీ సంచలనం సృష్టించింది. భారీ మొత్తంలో నగదు ఉన్న బాక్సును బైకు పై తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగింది. నగదు తరలిస్తున్న బైక్ ను వెంబడించిన దుండగులు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి నగదు ఉన్న బాక్సును దోచుకెళ్లారు. ఈ సంఘటన కూకట్ పల్లి మెట్రో పిల్లర్  836 వద్ద జరిగింది.   దోపిడీకి గురైన సొత్తు కోటి రూపాయలుగా తేలింది. అంత పెద్ద మొత్తంలో సొమ్ము బైక్ పై తరలించడమేంటన్న అనుమానంతో నగదు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సొమ్ము హవాలా సొమ్ముగా భావిస్తున్నారు. 

పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ హవాలా వ్యవహారం పూర్తిగా సినిమా ఫక్కీలో జరిగింది. కేవలం రూ.10 నోటును గుర్తుగా చూపించి భారీ మొత్తంలో నగదు మార్పిడి జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ  సందర్భంగా నగదు తరలిస్తున్న అజీముద్దీన్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు.

తాను, కుష్రో అనే మరో వ్యక్తీ అమీర్ వద్ద పని చేస్తున్నామన్న అజీముద్దీన్..   అమీర్ తమకు పది రూపాయల నోటు ఇచ్చి   కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తికి అందజే యాలని సూచించాడనీ,  ఆ నోటును చూపించిన తర్వాత పవన్ ఇచ్చే   నగదును తీసు కుని ఇబ్రహీంకు అందజే యాలని ఆదేశించాడని తెలిపారు. దీంతో తాను కుష్రో కలిసి  సోమవారం రాత్రి  ఎనిమిది గంటల సమయంలో  కూకట్‌పల్లికి చేరుకుని పవన్‌ను సంప్రదించగా, గోకుల్ ఎన్‌క్లేవ్ వద్దకు రావాలని చెప్పాడు. అక్కడ రూ.10 నోటు చూపించగానే కార్టన్ బాక్సుల్లో రూ. కోటి నగదును అందజేశారని అజీముద్దీన్ పోలీసులకు వెల్లడించాడు.

ఆ నగదును తీసుకుని ఇబ్రహీంకు కాల్ చేయగా..  మరో ప్రదేశానికి రావాలని సూచించాడని తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై ప్రయాణి స్తున్న సమయంలో పిలర్ నెంబర్ 836 వద్దకు రాగానే, రెండు బైకుల్లో వచ్చిన దుండగులు  తమపై కారం పొడి చల్లి దాడి చేసి...   కత్తులతో బెదిరించి మొత్తం నగదును దోచుకుని పరారయ్యారని తెలిపాడు. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దోచుకున్న సొమ్ముతో పరారైన వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వారు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంలో ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు.  పరారైన మిగిలిన నిందితుల కోసం  ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో హవాలా లావాదేవీలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

By
en-us Political News

  
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.