Publish Date:Nov 26, 2024
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజును ఆయన జన్మదినం రోజునే అదుపులోకి తీసుకుని కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కలకలం రేపింది. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఎవరినీ వదలేది లేదని రఘురామకృష్ణం రాజు అనాడే ప్రతిజ్ణ చేశారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడు నాడు కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిపై కేసుల దర్యాప్తు జోరందుకుంది. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు పోలీసు కస్టడీలో ఉన్న తనపై విజయపాల్ హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలుకు పిలిపించి ప్రశ్నించారు. తొలి సారి విచారణలో విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదు. ఆ తరువాత హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ కూడా ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం మంగళవారం విజయ్ పాల్ ను ఒంగోలు పోలీసులు మరో సారి సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేశారు. ఆయన రిమాండ్ రిపోర్టును కూడా రెడీ చేశారు. ఆయనను ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ది తొలి అరెస్టు. ఈ కేసులో విజయ్ పాల్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. ఇంకా ఈ కేసులో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహా మరి కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా పోలీసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు గత ప్రభుత్వంలో తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తనను భౌతికంగా అంతం చేయాలన్న కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చి వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇక విజయ్ పాల్ అరెస్టుతో డొంక కదిలే అవకాశం ఉంది. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా ముందు ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rrr-custodial-torcher-case-39-189045.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.