ఇక‌పై ఫ్యాక్ష‌న్ సీమ కాదు...సిరుల సీమ‌!

Publish Date:May 18, 2026

Advertisement

 

మొన్న కియా మోటార్స్, నిన్న  పుట్ట‌ప‌ర్తిలో ఫైట‌ర్ జెట్స్ ప‌రిశ్ర‌మ‌, ఇవాళ  చూస్తే రాయ‌ల్ ఎన్ఫీల్డ్ త‌యారీ.. సీమ రూపు మారిపోతోందా? ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా  రాయ‌ల‌సీమ. మార‌నున్న రూపు రేఖ‌లు ఎలాంటివి? ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారి లాంటి భూములు, ముఠా కక్షలు అనుకునే నెగెటివ్ మైండ్‌సెట్‌ని బద్దలు కొడుతూ... వరుసగా వస్తున్న భారీ ఇండస్ట్రీస్ సీమ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.

మొన్న కియా మోటార్స్ సృష్టించిన సంచలనం, నిన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్/ఫైటర్ జెట్స్ ఏవియేష‌న‌న్ క‌మ్ ఏరో స్పేస్ రంగానికి సంబంధించిన భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, ఇవాళ రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ బ్రాండ్ల రాక... ఇవన్నీ చూస్తుంటే రాయలసీమ కేవలం  ఇండస్ట్రియల్ హబ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఎకనామిక్ కారిడార్‌గా  అవతరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.

చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్- CBIC అడ్వాంటేజ్ ఒక‌టి క‌లిసొచ్చే అంశంగా మారింది.  
రాయలసీమలోని ప్రధాన జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప... బెంగళూరు, చెన్నై వంటి రెండు మెట్రో నగరాలకు చాలా దగ్గరగా ఉంటాయి.

ఈ కారిడార్ విస్తరణ వల్ల.. కేవలం కార్లు, బైకులే కాదు.. వాటికి కావలసిన స్పేర్ పార్ట్స్ తయారు చేసే వందలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలైన- MSMEs  సీమ అంతటా విస్తరిస్తున్నాయి. దీనివల్ల లోకల్ గా ఉండే చిన్న వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు వస్తాయి.

ఇక పోతే ఏరోస్పేస్ క‌మ్ డిఫెన్స్ హబ్‌గా పుట్టపర్తికి మే 15న కేంద్ర మంత్రి రాజ్  నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా శంఖుస్థాప‌న జ‌రిగింది. 

పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాలు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి వేదికగా మారుతున్నాయి. డ్రోన్ల తయారీ, ఫైటర్ జెట్స్ విడిభాగాలు, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్‌ తయారీ సంస్థలు ఇక్కడికి రావడం వల్ల... రాయలసీమ పేరు దేశ రక్షణ రంగ మ్యాప్‌లోకి ఎక్కింది. ఇది ఇక్కడి యువతకు అత్యున్నత స్థాయి టెక్నికల్ ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది.

తిరుప‌తి జిల్లాలోని శ్రీసిటీ- ఐటీ, హ‌బ్ గా రూపాంత‌రం  చెందుతూ వ‌స్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాలు, మ‌రీ ముఖ్యంగా  శ్రీసిటీ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్- EMC గా మారాయి. మనం వాడే ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు ఇక్కడే తయారవుతున్నాయి. తిరుపతి, అనంతపురం నగరాలు క్రమంగా IT కంపెనీలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులలో కొన్ని కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్నాయి. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే కాబట్టి, రాబోయే రోజుల్లో పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమ మదర్ హబ్‌గా నిలవబోతోంది.

ఒకప్పుడు కూలి పనుల కోసం బెంగళూరు, చెన్నై, లేదా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన రాయలసీమ బిడ్డలు... ఇప్పుడు సొంత ఊరిలోనే లేదా పక్క జిల్లాలోనే గౌరవప్రదమైన జీతాలతో ఇండస్ట్రీస్ లో సెటిల్ అవుతున్నారు.
పరిశ్రమల రాకతో నేషనల్ హైవేల విస్తరణ, ఫోర్-లేన్ రోడ్లు, కొత్త రైల్వే లైన్లు వేగంగా పెరుగుతున్నాయి. కడప, తిరుపతి, కర్నూలు, ఓర్వకల్లు, పుట్టపర్తి ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ సీమకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది.

జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఇక్కడ రావడం వల్ల స్థానిక యువత  గ్లోబల్ ఎంప్లాయ్స్ గా మారుతున్నారు. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో బాంబుల పొగలు, కత్తుల శబ్దాలు వినిపించేవి. కానీ ఇప్పుడు సీమ ఫ్యాక్టరీల్లో మెషీన్ల శబ్దాలు, ప్రగతి చక్రాల పరుగు కనిపిస్తోంది.  సీమ పౌరుషం అంటే గొడవలు పడటం కాదు, ప్రపంచ స్థాయి బ్రాండ్లను తయారు చేసి చూపించడం అని ఇక్కడి యువత నిరూపిస్తోంది.
 

By
en-us Political News

  
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టి తృటిలో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్నాడు. అయితేనేం.. ఈ ఇన్నింగ్స్‌లో 334.48 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్‌ను తుత్తునియలు చేసేశాడు. ఆస్ట్రేలియా పేస్ స్టార్ పాట్ కమిన్స్ వేసిన ఓవర్లలో సైతం హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి పవర్‌ప్లేలోనే రాజస్థాన్ జట్టు స్కోరును 80 పరుగులకు చేర్చాడు.
ఇరాన్ గనుక ఈ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ జలసంధిని ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచేలా అమెరికా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఏ దేశం కూడా హర్మూజ్ జలసంధిని తమ గుత్తాధిపత్యంగా మార్చుకోలేదన్నారు.
1947లోనే బిఎ పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా.. సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు.
1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.