రెచ్చిపోయిన రూసో..దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లా చిత్తు

Publish Date:Oct 27, 2022

Advertisement

సిడ్నీలో గురువారం  జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్12 మ్యాచ్ దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 16 ఓవర్లలో కేవలం 101 పరుగులు చేసి వెనుదిరిగింది. మంచి ఫీల్డింగ్ సత్తా ఉన్న బంగ్లాదేశ్ ఊహించని విధంగా భారీ స్కోర్ సమర్పించుకోవడం, బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం కావడం ప్రేక్షకులు ఊహించలేదు. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేంత బ్యాటర్లు బంగ్లా జట్టులో లేకపోలేదు. కానీ చాలా పేలవంగా ఆడి మ్చాచ్ ను సమర్పించుకున్నారు. 

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రూసో బంగ్లాదేశ్ ఫీల్డర్లకు, బౌలర్లకు సింహస్వప్పంగా మారాడు. సిడ్నీలో భారీ సెంచరీతో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 56 బంతుల్లో రూసో 109 పరుగులు (14 ఫోర్లు) చేయడంతో దక్షిణాఫ్రికా 20  ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 205 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇదే అతని తొలి సెంచరీ. 16వ ఓవర్లో తొలి బంతిని సింగిల్ తీయడంలో సెంచరీ పూర్తి చేసిన ఆనందంలో గెంతులు వేశాడు, రూసో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. సిడ్నీ గ్రౌండ్లో  ఇంతటి టోర్నీలో సెంచరీ చేయడం అందునా 20 ఓవర్లో మ్యాచ్లో చేయడం అంత సులభం కాదు. 

ఇంతకు ముందు భారత్ తో తలపడిన టీ20 సిరీస్ లో 48 బంతుల్లోనే సెంచరీ చేసి తన బ్యాటింగ్ సత్తాను భారత్ బౌలర్లకు తెలియజేశాడు. రూసోకి ధీటుగా మరో వంక డీ కాక్ కూడా రెచ్చిపోయి 38 బంతుల్లో 63 పరుగులు(11 ఫోర్లు) చేయడంలో తన బ్యాటింగ్ సత్తాను మరోసారి ప్రదర్శించాడు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.