కారు దిగి చేయి అందుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. టీడీపి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు. రానున్న ఎన్నికలలో మహేశ్వరం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆమెకే దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే తీగల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. సబితా ఇంద్రారెడ్డితో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడాన్ని వారు ఇందుకు తార్కానంగా చెబుతున్నారు. ఇఫ్పటికే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెరాసలో అసంతృప్తులతో టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. ఒక ప్రణాళిక మేరకు ఆయన తెరాస అసంతృప్తులను కాంగ్రెస్ లోనికి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు.
అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rormer-mayor-teegala-to-join-congress-25-139152.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.