చచ్చు పుచ్చు ప్లాన్స్ వేయాలంటే రోజా తరవాతే ఎవరైనా!
Publish Date:May 14, 2024
Advertisement
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని, మిమ్మల్ని మీరు కాపాడుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. పదేళ్ళుగా నగరిలో రోజా, ఆమె బ్రదర్స్ చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. నగరి విధ్వంసం అలా వుంటే, రోజా తన కార్పొరేషన్ నోటితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి రాష్ట్ర రాజకీయాలలో విలువలు అనేవి వున్నాయా లేవా అనే డౌట్ వచ్చేలా చేశారు. అటు నగరి నాశనం, ఇటు నైతిక విలువలు నాశనం. మొత్తమ్మీద రోజాని సాగనంపడం అనేది ఏపీ రాజకీయాలలో ఒక అదృష్టకర పరిణామం. అసలు దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో కూడా రోజా లాంటి ఓటమి ఒప్పుకున్న తీరు ఎప్పుడూ జరిగి వుండదు. ఒకవైపు పోలింగ్ జరుగుతూ వుండగానే, నేను ఓడిపోబోతున్నానను. నా ఓటమికి కారణం నా పార్టీలోవాళ్ళే అని చెప్పడం ఇంతవరకు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఈ అరుదైన ఘనతను సాధించిన రోజాకి అభినందనలు. ఓడిపోతున్నప్పటికీ, ఆ ఓటమిని కవర్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాన్ వేసిన రోజాకి అశుభాకాంక్షలు. ఇంతకీ రోజా ప్లాన్ ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోతే జనం ఏమనుకుంటారు? భారీస్థాయిలో అవినీతి చేయడం, చంద్రబాబు నాయుడి మీద నోరేసుకుని పడిపోయి, ఇష్టమొచ్చినట్టు తిట్టడం వల్లే జనం ఓడించారని అనుకుంటారు. అదే వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని ఎలా కవర్ చేయాలి? నేను ఓడిపోయింది నా బిహేవియర్ వల్ల కాదు.. నా పార్టీలో వున్న వాళ్ళు మోసం చేయడం వల్లే అని చెప్పుకుని తిరగాలి. ఎలాగూ ఓడిపోయిన తర్వాత చెప్పుకునేది అదే. పోలింగ్ సమయంలోనే ఓడిపోతున్నట్టు తెలిసిపోయింది కాబట్టి, ఇప్పటి నుంచే తన ఓటమి కారణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓపని అయిపోతుంది కదా అని రోజా పోలింగ్ రోజే తన ప్లాన్‌ని అమల్లో పెట్టేశారు. జూన్ 4న అధికారికంగా ఓడిపోయిన తర్వాత, ‘‘నేను ఓడిపోయింది నా అవినీతి, నా నోటి వల్ల కాదు.. నా పార్టీలో వాళ్ళు వెన్నుపోటు పొడవటం వల్లే’’ అని చెప్పుకుని తిరగొచ్చు. మొత్తానికి రోజా చచ్చుపుచ్చు ప్లాన్ సూపరే సూపర్!!
http://www.teluguone.com/news/content/roja-plan-on-defete-25-175931.html