Publish Date:Apr 11, 2022
ఎన్నాళ్లో వేచిన రోజు.. రోజాకు ఆవిష్కృతమైంది. మూడేళ్లుగా కలలు కంటున్న మంత్రి పదవి వరించింది. జగనన్నను నమ్ముకున్నందుకు.. లేటైనా మినిస్టర్ పోస్ట్ వెతుక్కుంటూ వచ్చింది. పెద్దిరెడ్డి పెద్ద కిరికిరే పెట్టినా.. జగన్‌రెడ్డి రోజాకి ఇచ్చిన హామీ నెరవేర్చారు. మంత్రి పదవిపై మాట నిలబెట్టుకున్నారు. కొన్ని రోజులుగా ఆలయాల చుట్టూ తిరిగినందుకు.. దేవుళ్లందరికీ మొక్కినందుకు ఫలితం లభించింది. అందుకే, ఆర్కే రోజా అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రోజమ్మ పులకించిపోయారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదే సంతోషంలో జగన్ కాళ్లకు నమష్కరించారు. ప్రేమతో జగనన్న చేయిపై ముద్దాడారు. జగన్ సైతం ఆమె తలపై చేయి పెట్టి.. నేనున్నానంటూ ఆశీర్వదించారు. ఈ సీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికే హైలెట్ అంటున్నారు.
రోజానే కాదు.. పలువురు మంత్రులు సైతం సీఎం జగన్‌పై తమ భక్తిని, విధేయతను బహిరంగంగానే చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు మంత్రులు.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్ కాళ్లకు మొక్కి.. సదా మీ సేవలో అన్నట్టు వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది.
ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి నారాయణస్వామి సీఎం జగన్ కాళ్లను తాకి నమస్కరించారు. మంత్రి ఉష శ్రీచరణ్ సైతం సీఎం కాళ్లకు మొక్కారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, జోగి రమేశ్ మరింత విధేయతతో మోకాళ్లపై పడి మరీ నమస్కరించారు. బహుషా, తమది మంత్రి స్థాయి కాకున్నా.. మంత్రి పదవి ఇచ్చినందుకో..మరెందుకో.. అంతటి కృతజ్ఞత చాటుకున్నారని అంటున్నారు. ఇంతకీ వారిది వినయమా? అతివినయమా!? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-kiss-to-cm-jagan-25-134236.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి