Publish Date:Apr 29, 2022
కేటీఆర్ కామెంట్లు ఏపీలో కాక రేపుతున్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ ఉండదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వానం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. మంత్రులంతా పోలోమంటూ కౌంటర్ ఇస్తూ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి, జోగి రమేశ్, బొత్స, రోజా.. ఇలా మంత్రులంతా ఎవరికి తోచిన బాషలో వాళ్లు మా ఏపీ గొప్ప.. అంటూ కవర్ చేస్తున్నారు.
ఇక రోజా అయితే సంథింగ్ డిఫరెంట్. ఓ వైపు కరెంట్ మంటలు సెగలు పుట్టిస్తుంటే.. రోజా మాత్రం నేరుగా ప్రగతిభవన్ వెళ్లారు. సీఎం కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. తనకు మంత్రి పదవి వచ్చినందుకు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కట్ చేస్తే.. ప్రగతి భవన్ నుంచి బయటకు రాగానే.. కేటీఆర్‌కు కౌంటర్ వేసి మరింత కామెడీ చేశారు. ఏపీకి వస్తే అభివృద్ధి చూపిస్తానంటూ రోజా ఆహ్వానించారు. అదేంటి.. ప్రగతిభవన్‌లో నవ్వుతూ ఫోటోలు దిగి.. బయటకు రాగానే విమర్శలా? అంటూ నెటిజన్లు రోజాను సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు. జబర్థస్త్ కామెడీ అంటూ.. దొందు దొందేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక, ఏపీ మంత్రుల విమర్శల్లో బొత్స సత్యనారాయణ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ చెప్పేదంతా అబద్దం.. నేను ఇటీవలే హైదరాబాద్‌లో ఉండివచ్చా.. అక్కడ కరెంట్ లేదు.. జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందంటూ పిచ్చ కామెడీ చేశారు. అయితే, బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. బహుషా, బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో. అందుకే కరెంట్ కట్ చేశారు కావొచ్చు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ ఆయన వేసిన సెటైర్ భలే పేలింది. మంత్రి బొత్సను సైతం హైదరాబాద్‌లో ఉండే ఏపీ వాసులు పోస్టులతో ఆటాడుకుంటున్నారు. బొత్స ఉన్నది ఎక్కడో చెప్పాలని.. మాకు మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవట్లేదని.. బొత్స చెప్పేదంతా అబద్దమని.. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసుల బంధువులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో బొత్సను చెడుగుడు ఆడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-and-botsa-on-ktr-comments-25-135227.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.